Bhanu Athaiya Dies: భారతదేశ తొలి ఆస్కార్ విజేత భాను అథియా కన్నుమూత

Costume designer Bhanu Athaiya Dies | ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా (91) కన్నుమూశారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భాను అథియా తుదిశ్వాస విడిచారు. (Bhanu Athaiya Passed Away)

Last Updated : Oct 16, 2020, 07:33 AM IST
Bhanu Athaiya Dies: భారతదేశ తొలి ఆస్కార్ విజేత భాను అథియా కన్నుమూత

భారతదేశ తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా (91) కన్నుమూశారు (Bhanu Athaiya Passed Away). వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న భాను అథియా ముంబైలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు (Costume designer Bhanu Athaiya Dies). తన తల్లి మరణవార్తను ఆమె కుమార్తె రాధికా గుప్తా వెల్లడించారు. దేశానికి తొలి ఆస్కార్ అవార్డు అందించిన ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. భాను అథియా అంత్యక్రియలను దక్షిణ ముంబైలోని చందన్ వాడీ శ్మశానవాటికలో నిర్వహించారు.

మెదడులో కణతిని తొలగించేందుకు ఎనిమిదేళ్ల కిందట ఆమెకు సర్జరీ చేశారని కూతురు తెలిపారు. ఆపై భాను అథియా శరీరంలో ఓ భాగం పక్షవాతానికి గురై మంచానికి పరిమితం అయ్యారని, చివరగా నిద్రలో ప్రశాంతంగా తన తల్లి తనువు చాలించారని వివరించారు. 1983లో తెరకెక్కిన ‘గాంధీ’ సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ఆ సినిమాకుగానూ భాను అథియా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. భారతదేశానికి తొలి ఆస్కార్ అందించిన వ్యక్తి భాను అథియా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 

 

కాగా, మహరాష్ట్రలోని కొల్లాపూర్‌లో భాను అథయా ఏప్రిల్ 28, 1929లో జన్మించారు. 1956లో హిందీ మూవీ సి.ఐ.డి సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా 100 సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. భారత్‌కు ఆస్కార్ అవార్డును పరిచయం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x