నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పైపులైన్‌ను ఢీకొట్టడంతో నలుగురు యువకులు అక్కడికక్కడి దుర్మరణం చెందారు. హాస్పిటల్‌కు తరలిస్తుంటే మరో యువకుడు చనిపోయాడు. హైదరాబాద్ -   సాగర్ హైవేపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయిదుగురు యువకులు హైదరాబాద్ నుంచి మల్లెపల్లికి కారులో బయలుదేరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాటర్ పైపు లైనును ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడిని హాస్పిటల్‌కు తరలిస్తుంటే చనిపోయినట్లు సమాచారం. నిద్రమత్తుతో పాటు అతివేగంగా వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.