Moranchapalli Floods: తెలంగాణలో కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల 62 సెం.మీల వర్షపాతం, 47 సెం.మీల వర్ష పాతం నమోదవుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునగడంతో.. గ్రామంలో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హెలికాప్టర్ ద్వారా ప్రజలను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలట్రీ అధికారులతో చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి సంప్రదింపులు జరుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవడం కష్టం అవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే మోరంచపల్లికి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్ బృందాలు) తరలివెళ్లాయి. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు సీఎస్‌ నివేదిస్తున్నారు. ఇతర వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.


మోరంచపల్లిలో ఇప్పటికే ముగ్గురు గ్రామస్థులు కొట్టుకుపోగా.. తాజాగా మరో మహిళ గల్లంతు అయ్యింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ గ్రామానికి బయల్దేరాయి. అధికారులు ములుగు నుంచి బోట్లు తెప్పిస్తున్నారు. నీట మునిగిన మోరంచపల్లె గ్రామ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిస్థితి దగ్గర ఉండి సమీక్షిస్తున్నారు.  


రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. తెలంగాణ చరిత్రలో అత్యంత భారీ వర్షపాతాలు నమోదు అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ములుగు జిల్లా వాజేడులో గత 2013 జూలై 19 తరవాత తిరిగి గడచిన 24 గంటలలో 51.5 సెం.మీల వర్షం కురిసింది. గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీల వర్షం పడింది. గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన వర్షపాతం నమోదు. 200ల కేంద్రాల్లో 10 సెం.మీల పైగా వర్షం కురిసింది. మొన్న నిజామాబాద్ జిల్లాలో 45 సెం.మీల వర్షపాతం నమోదైంది. భారీ వర్షపాతాలపై వాతావరణ శాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Hyderabad Rains: అర్ధరాత్రి విరుచుకుపడుతున్న వరుణుడు, రేపు ఉదయం వరకూ అతి భారీ వర్షాల


Also Read: IND vs WI 1st ODI: విండీస్ తో తొలి వన్డే నేడే.. తుది జట్టులో ఉండేది ఎవరు?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook