Harish Rao: పదేళ్లు బీజేపీ పాలనలో.. నాలుగు నెలలు కాంగ్రెస్‌ పార్టీ పాలనను చూసిన వారెవరూ చీము నెత్తురు ఉంటే కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేయరు అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీమంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అద్భుతంగా పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Warangal MP Seat: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న 'కడియం' రాక.. ఎంపీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డికి కొత్త 'తలనొప్పి'


మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహాక సమావేశాల్లో భాగంగా తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న హరీశ్‌ రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మెదక్‌ ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. 'మనం పదేళ్లు పాలించినం... వాళ్లు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది' అని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

Also Read: KT Rama Rao: కాంగ్రెస్‌ అభ్యర్థిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. 'పనికి రాని చెత్త'గా అభివర్ణన


 


'సిద్దిపేటలో సగం నిర్మించిన వెటర్నరీ కళాశాలను రద్దు చేసి రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు తరలించుకుపోయాడు' అని హరీశ్ రావు ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారు.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు.. పని లేదు అని ఎద్దేవా చేశారు. 'ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చింది. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితది' అని గుర్తుచేశారు.


బీజేపీపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 'బీజేపీ పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ. విభజన సమయంలో సీలేరును లాక్కుని రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ. పదేళ్లలో బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉందా? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురజ చల్లిండు. ఇప్పుడు మాత్రం మోదీని బడే మియా అంటుండు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నారు' అని తెలిపారు.


బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావుపై హరీశ్ రావు ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. 'ఇంటికి రెండెడ్లు, నిరుద్యోగ భృతి ఇస్తానని, రైలు తెస్తానని అబద్ధాలు చెప్పి ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్‌కు మొన్నటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు' అని తెలిపారు. సిద్దిపేట కు అన్యాయం జరిగితే... అక్కసు వెళ్ళగట్టితే ఉరుకుందామా....


సిద్దిపేట ప్రజలుగా చీము నెత్తురు ఉన్నోళ్లం మళ్లీ కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేసి మోసపోదామా? సిద్దిపేటలో వివిధ అభివృద్ధి పనులు, రోడ్లకు కేటాయించిన రూ.150 కోట్లను రేవంత్‌ రెడ్డి రద్దు చేశాడు' అని హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు వెళ్లగక్కిన కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలి' అని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సిద్దిపేట చాటుదాం అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter