KTR meet Social Warriors: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిలదీస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. చెప్పుతో కొట్టాలి అనే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలపై ప్రశ్నిస్తే దౌర్జన్యంగా.. అలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని నిలదీశారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు. వంద రోజుల్లోపు హామీలు నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలందరూ నిలదీయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలి అని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలను అడిగారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశం బుధవారం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమావేశంలో కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. 'అబద్ధాలను నమ్ముకుని నరేంద్ర మోదీ ప్రధానిగా, రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు' అని విమర్శించారు. అధికారంలోకి వస్తామని అనుకోని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో అడ్డమైన హామీలను ఇచ్చిందని తెలిపారు. నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ వెళ్లిన కాంగ్రెస్‌ వాళ్లు ఇప్పుడు అధికారంలోకి రాగానే వాటిని నెరవేర్చడానికి తిప్పలు పడుతున్నారని తెలిపారు. 420 హామీలపై నిలదీద్దామని పిలుపునిచ్చారు. 


గృహజ్యోతి పథకం అమలుపై మాట మారుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ మండిపడ్డారు. 'ఎన్నికల్లో ఎవరన్న వచ్చి బిల్లు అడిగితే రేవంత్‌రెడ్డి, సోనియా గాంధీ కడతారని అప్పుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నవంబర్‌, డిసెంబర్‌ బిల్లు కట్టొద్దని చెప్పారు. ఇప్పుడు నేను కూడా కట్టొద్దనే చెబుతున్నా. దానికి మంత్రులు నాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు' అని కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికీ చెబుతున్నా ప్రజలెవరూ విద్యుత్‌ బిల్లులు చెల్లించవద్దని మరోసారి కేటీఆర్‌ ప్రజలకు సూచించారు.
 



అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్‌ స్పందిస్తూ.. ఎన్నికల్లో తమకు చిన్న దెబ్బే తగిలిందని పేర్కొన్నారు. 'రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తే మనల్ని ఛీ కొట్టలేదు. తీసి అవతలపడేయలేదు. 39 సీట్లు, మూడో వంతు సీట్లు ఇచ్చారు. 14 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. వాటిలో మనం గెలిచి ఉంటే నేడు ఎలా ఉండేదో అందరికీ తెలుసు' అని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ గెలిచిన సీట్లలో అభ్యర్థులు అడుక్కోవడం ద్వారా, భావోద్వేగాల ద్వారానే గెలిచారని చెప్పారు.


పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం సోషల్‌ మీడియాలో విమర్శలను బలంగా తిప్పికొట్టకపోవడం కూడా ఒకటి అని కేటీఆర్‌ చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని హామీల విషయమై ఎప్పటికప్పుడు నిలదీయాలని కేటీఆర్‌ సూచించారు. సోషల్‌ మీడియాను పార్టీకి ప్రచారాస్త్రంగా వాడుకోవాలని చెప్పారు. అన్ని విషయాలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు. కరీంనగర్‌లో మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు సోషల్‌ మీడియా ప్రతినిధులు కూడా కృషి చేయాలని కోరారు. 

Also Read: AAP alone Contest: కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. ఆమ్‌ ఆద్మీ కూడా బంధానికి బ్రేక్‌
 


Also Read: Parliament Elections: కాంగ్రెస్‌కు మమత భారీ షాక్‌.. బెంగాల్‌లో కటీఫ్‌.. ఢిల్లీలో దోస్తీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook