Manmohan at Telangana: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ అస్తమయం దేశ ప్రజలకు తీరని లోటు. అదే సమయంలో తెలంగాణ ప్రజలకు మరింత బాధకల్గించే అంశం. ఆయన హయాంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడటం ఒక్కటే కాదు..సొంత పార్టీ ఎంపీల హెచ్చరికల్ని బేఖాతరు చేసి తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2004 నుంచి 2014 వరకూ రెండు సార్లు దేశ ప్రధానిగా అంతకు ముందు కేంద్ర ఆర్ధిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్‌ను తెలంగాణ ఉన్నంతవరకూ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారు. 2009-2014 వరకూ ప్రతి అడుగు ఆచిచూతి వేసిన మన్మోహన్ సింగ్ సొంత పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల రాజీనామా హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేశారు. ప్రత్యేక తెలంగాణ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం పీక్స్‌కు చేరడం నుంచి ఉద్యమం విజయవంతమై ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంతా మన్మోహన్ హయాంలోనే జరిగిన పరిణామాలు. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడమే కాకుండా ఏపీ పునర్విభజన చట్టం రూపకల్పన, ఏపీకు హామీలు అన్నీ ఆయన ఇచ్చినవే. రాష్ట్ర విభజన సమయంలో మన్మోహన్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు లేకపోయినా వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ ఏర్పాటు చేశారు. 


రాష్ట్ర విభజన ప్రకటన చేసినప్పుడు ఏపీ నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించి రాజీనామాకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో కేంద్ర కేబినెట్‌లో ఏపీ మంత్రులు ఐదుగురున్నారు. అయినా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. ఏపీ నుంచి వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రత్యేక హోదా హామీతో పాటు కేంద్ర సంస్థల ఏర్పాటు హామీ ఇచ్చింది మన్మోహన్ సింగే. మొత్తానికి తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్రను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. 


Also read: IMD Alert: ఐఎండీ నుంచి కీలక ప్రకటన, ఇవే ఆఖరి వర్షాలు ఏప్రిల్ వరకూ నో రెయిన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.