Former Rowdy Sheeter Yerukala Srinu Arrested: కొడుకు పెళ్లి మండపంలో తండ్రిని అరెస్ట్ చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..  జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన మాజీ రౌడీ షీటర్ ఎరుకల శ్రీను కొడుకు వివాహం నగరంలోని నాగోల్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో గురువారం జరుగుతోంది. ఆయన పెళ్లి హాజరైన సమాచారం తెలుసుకున్న పోలీసులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. సినీ ఫక్కీలో ఆయనను అక్కడే అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాజీ రౌడీ షీటర్ కుతడి శ్రీను అలియాస్ ఎరుకాల శ్రీనుపై ఏడు ల్యాండ్ కబ్జా పెండింగ్ కేసులు ఉన్నాయి. 8 ఏళ్ల క్రితం మేడ్చల్‌లో వెంచర్ నిర్మాణ సమయంలో పక్క స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆయనపై కేసు నమోదైంది. దీంతో గత 8 ఏళ్లుగా ఎరుకాల శ్రీను కోసం పోలీసులు వెతుకుతున్నారు. తన రెండో కొడుకు పెళ్లి కోసం హైదరాబాద్ శ్రీను వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కొడుకు పెళ్లి మండపంలోనే ఎరుకాల శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు.


ఎరుకల శ్రీను అరెస్ట్ వెనుక రాజకీయ కోణం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓ మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు అరెస్టు చేశారని మండిపడుతున్నారు. యంటిసిపేటరీ బెయిల్ ఉన్న కూడా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకుండా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకబ్జా కేసులో ఎరుకల శ్రీనును  అరెస్ట్ చేసిన విషయాన్ని మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి ధ్రువీకరించారు. శుక్రవారం ఉదయం శ్రీనును రిమాండ్‌ కి తరలించినట్లు చెప్పారు.  పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.


Also Read: Hindenburg vs Adani: సర్వత్రా ఉత్కంఠ.. అదానీ వ్యవహారంపై నేడు సుప్రీంలో విచారణ  


 Also Read: North Korea Military Parade: ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి