North Korea Military Parade: ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన

North Korea Missiles: ఉత్తర కొరియా తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రపంచానికి చూపించింది. ఆ దేశ ఆర్మీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ కవాతులో మారణాయుధాలు, అతిపెద్ద క్షిపణులు ప్రదర్శించగా వీక్షకులను ఆకట్టుకున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2023, 11:56 AM IST
North Korea Military Parade: ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన

North Korea Missiles: ఉత్తర కొరియాలో సైన్యం ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కొరియా సైన్యం నిర్వహించిన ఈ కవాతులో మారణాయుధాలు, అతిపెద్ద క్షిపణులు ప్రదర్శించారు. గతంలో ఎన్నడులేనంతగా తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ఈ కవాతులో ప్రదర్శించడం విశేషం. ఇందుకు సబంధించిన చిత్రాలను ఆ దేశ మీడియా రిలీజ్ చేసింది. ఈ వేడుకను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ తన భార్య, కుమార్తె కలిసి వీక్షించారు.

ప్యాంగ్యాంగ్‌లోని కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ వద్ద కవాతు ప్రారంభమైంది. కవాతుకు సంబంధించిన చిత్రాలను ఆ దేశ మీడియా విడుదల చేసింది. ఉత్తర కొరియా అణు దాడి సామర్థ్యానికి ఇది కవాతు సాక్ష్యం అని పేర్కొంది. ఈ ఫొటోల్లో 11 హ్వాసాంగ్-17 క్షిపణులు కనిపిస్తున్నాయి. హ్వాసాంగ్-17ను గతేడాది తొలిసారిగా పరీక్షించారు. ఇది ఉత్తర కొరియా అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కూడా ఉంది. ఇది ప్రపంచంలో ఎక్కడైనా అణు దాడి చేయగలదు. కొత్త ఘన ఇంధన ఐసీబీఎం నమూనాలు కూడా కవాతులో కనిపించాయి. 

పరేడ్ ప్రారంభానికి ముందు అనేక జెట్‌లు, టర్బోప్రాప్ విమానాలు, రంగురంగుల లైట్లతో కూడిన హెలికాప్టర్లు కిమ్ ఇల్ సుంగ్ స్క్వేర్ పైన తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయి. ఈ ప్రదర్శనలు వీక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు ఉన్నా.. ఉత్తర కొరియా భారీ అధునాతన క్షిపణులను నిరంతరం పరీక్షిస్తోంది. 

ప్రస్తుతం ఉత్తర కొరియా క్షిపణుల్లో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా దేశాల్లో కూడా పెద్ద బాలిస్టిక్ క్షిపణుల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. 2017 నుంచి ఉత్తర కొరియా ద్రవ ఇంధనంతో ఐసీబీఎమ్‌లను మాత్రమే పరీక్షించింది. ద్రవ ఇంధనంతో క్షిపణి ప్రయోగానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఘన ఇంధనం సహాయంతో క్షిపణి మరింత చలనశీలతను పొందుతుంది. ప్రయోగించడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తర కొరియా కొత్త క్షిపణుల్లో ఘన ఇంధనాన్ని వినియోగిస్తోందని భావిస్తున్నారు. పరేడ్‌లో ఘన ఇంధన ఐసీబీఎమ్‌  నమూనాను ప్రదర్శించారు. 

ఉత్తర కొరియా అతిపెద్ద క్షిపణి కవాతుపై అమెరికా రక్షణ నిపుణులు కన్నేశారు. అమెరికాకు చెందిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన అంకిత్ పాండా కొరియాకు చెందిన ఐసీబీఎమ్ 11 హ్వాసాంగ్-17ఎస్ పనితీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈసారి ఉత్తర కొరియా పరేడ్‌లో కొన్ని ఐసీబీఎమ్ లాంచర్‌లు కనిపించాయని.. ఇవి తాము గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయన ట్వీట్ చేశారు.

Also Read: Indigo Airlines: ఇండిగో ఎయిర్‌లైన్స్ పొరపాటు.. 37 మంది ప్రయాణికుల లగేజీ మిస్సింగ్  

Also Read: CM Jagan Mohan Reddy: ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లోకి డబ్బులు జమ.. ఒక్కొక్కరికి రూ.లక్ష  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News