Vishadam: చందానగర్ సూసైడ్ కేసులో కొత్త కోణం.. భార్యపై అనుమానంతో భర్తే హత్య చేశాడా?
Vishadam: హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా కనిపించారు.
Vishadam: హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. బ్లాక్ నెంబర్ 18 రాజీవ్ గృహకల్ప లో నివాసముంటుంది కుటుంబం. గత శుక్రవారం నుండి ఇంటి తలుపు వేసివున్నట్లు చేబుతున్నారు స్థానికులు. ఆ ఇంటి నుంచి దుర్గంధం రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. చూసేందుకు వెళ్లగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంత కొట్టినా ఎవరూ తీయకపోవడంతో తలుపులు పగుల గొట్టి ఇంటి లోపలికి వెళ్లారు స్థానికులు. ఇంట్లో భర్త నాగరాజు ,భార్య సుజాత, ఇద్దరు పిల్లలు రమ్యశ్రీ,, టిల్లు చనిపోయి కనిపించారు.దీంతో శుక్రవారమే వీళ్లు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
మృతులు గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారని స్థానికులు చెప్పారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యా లేక ఇంకా ఏమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల విచారణలో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. భార్య సుజాత పై అనుమానంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. భార్యతో పాటు పిల్లలను చంపి అతను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. భార్యపై అనుమానంతో టైలరింగ్ కత్తెరతో పొడిచి చంపినట్లు అనుమానిస్తున్న పోలీసులు నాగరాజు లూనాపై తిరుగుతూ బ్రెడ్లు అమ్ముతుండేవాడని తెలుస్తోంది. సుజాత టైలరింగ్ పనిచేస్తుంది.
Read Also: Munugode Bypoll: మునుగోడుపై హైకోర్టుకు టీఆర్ఎస్.. ఎందుకో తెలుసా?
Read Also: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook