Singareni coal mine accident : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పరిధిలోని ఎస్ఆర్పీ-3 బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గనిలో పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా... మరికొందరు గాయపడినట్లు సమాచారం. మొదటి షిఫ్ట్‌లో కార్మికులు (Singareni workers) విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలినట్లు తెలుస్తోంది. మృతులను కృష్ణారెడ్డి (59), లక్ష్మయ్య (60), నర్సింహరాజు (30) చంద్రశేఖర్ (29)గా గుర్తించినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్ఆర్పీ-3 (SRP 3 coal mine) గనిలోని డీప్-21, లెవల్-24 వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు వెలికితీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రక్షణను పక్కనపెట్టి ఉత్పత్తే ధ్యేయంగా పనిచేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమాచారం తెలియడంతో మిగతా కార్మికుల కుటుంబాల్లోనూ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం గని వద్ద భారీ పోలీస్ భద్రత (Police protection) ఏర్పాటు చేసినట్లు సమాచారం.


ఇదే శ్రీరాంపూర్ (Srirampur coal mine division) పరిధిలోని ఆర్కే-7 న్యూటెక్ గనిలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన ప్రమాదంలో వినోద్, రవి అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పని ప్రదేశంలో సైడ్ వాల్ కూలి బొగ్గు పెళ్లలు మీద పడటంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. 


Also Read:Mother sells 3day old son : పేద‌రికంతో పేగుబంధాన్ని అమ్ముకున్న తల్లి


జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో కేటీకే-6 గనిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరికొందరు శిథిలాల చిక్కుకుని గాయపడ్డారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి మృతదేహాలతో పాటు క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చింది. మృతుల కుటుంబాలు,బంధువులు గని వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై గని అధికారులు అంతర్గత విచారణ చేపట్టగా... పోలీసులు కేసు నమోదు చేశారు.


Also Read:Woman Kills Husband : ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య


గతేడాది జూన్‌లోనూ‌ గోదావరిఖనిలోని ఓపెన్ కాస్ట్‌లో (Singareni open cast mine) బ్లాస్టింగ్ మిస్‌ ఫైర్ అయి నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులను గోదావరిఖనికి చెందిన రాకేష్, ప్రవీణ్‌,కమాన్ పూర్‌‌కు చెందిన రాజేష్, మరొకరు రత్నాపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.మృతులకు సింగరేణి యాజమాన్యం రూ.40లక్షలు పరిహారం ప్రకటించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook