Free Bus To Medaram: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీంతో మన రాష్ట్రానికి చెందిన మహిళలు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు  బస్సు ఛార్జీలు వసూలు చేస్తామని ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను టీఎస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరస్కరించారు.  మేడారం జాతరకు వెళ్లే మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని, వారి వద్ద ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు సమ్మక్క సారలమ్మ జాతరను ఇటీవల బుధవారం మంత్రి సీతక్క, కొండా సురేఖ సందర్శించారు. ఈ విషయంపై స్పందించారు. మేడారం జాతరకు వచ్చే మహిళలకు కూడా ఫ్రీ బస్ సౌకర్య కొనసాగుతుందని మీడియాతో మంత్రి సీతక్క చెప్పారు.


ఇదీ చదవండి:  Mahalakshmi Scheme: మహిళల ఖాతాల్లో ఆరోజే రూ.2,500 జమా.. మహాలక్ష్మి పథకంపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్..!


తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహిస్తారు. అంతేకాదు ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతరలు నిర్వహించనున్నారు.


ఇదీ చదవండి:  KTR Viral Tweet: సంచలనం రేపుతోన్న కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్.. రాష్ట్రరాజకీయాల్లో తీవ్రచర్చ..! 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook