తెలంగాణలో కోవిడ్ 19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో పరీక్షలపై దృష్టి పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉచితంగా పరీక్షల్ని నిర్వహించేందుకు హైదరాబాద్ లో 11 ప్రాంతాల్ని ఎంపిక చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్రమణ తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా పెరుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో  పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ నేపధ్యంలో హైకోర్టు సైతం కోవిడ్ 19 పరీక్షల్ని ఎందుకు చేయడం లేదంటూ ఆగ్రహం చెందింది. తెలంగాణలో ఇప్పటివరకూ  16 వేల 4 వందల వరకూ కరోనా కేసులు వెలుగు చూశాయి.  జీహెచ్ ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల్ని ముమ్మరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని 11 ప్రాంతాల్లో ఉచిత కోవిడ్ నిర్ధారణ సెంటర్లను నెలకొల్పింది. ఆ సెంటర్లు ఇవే…Also read: TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌పై ఈడీ కేసు


కింగ్ కోఠి ఆస్పత్రి…                  కోఠి


ఫీవర్ ఆస్పత్రి ….                     నల్లకుంట


ఛెస్ట్ ఆస్పత్రి…                         ఎర్రగడ్డ


నేచర్ క్యూర్ ఆస్పత్రి..            అమీర్ పేట్


సరోజినీ కంటి ఆస్పత్రి..           మెహదీపట్నం


ఆయుర్వేద ఆస్పత్రి…             ఎర్రగడ్డ


హోమియోపతి ఆస్పత్రి…      రామంతపూర్


నిజామియా టీబీ ఆస్పత్రి…     చార్మినార్


ఏరియా ఆస్పత్రి…                   కొండాపూర్


ఏరియా ఆస్పత్రి,..                    వనస్థలిపురం


ఈఎస్ఐ ఆస్పత్రి…                  నాచారం


కోవిడ్ 19 వైరస్ లక్షణాలున్నవారు ఈ ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు. Also read: Ap special status: ప్రత్యేక హోదా సాధ్యం కాదు: మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్