Gaddar Meet Amit sha: అమిత్ షాను గద్దర్ ఎందుకు కలిశారు? బీజేపీ సభలో అసలేం జరిగింది?
Gaddar Meet Amit sha: గద్దర్ వ్యవహారశైలిలో మార్పు వచ్చింది. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడం సంచలనంగా మారింది. కరుడుగట్టిన వామపక్ష వాదిగా ఉన్న గద్దర్.. కరుడుగట్టిన కాషాయవాదిని కలుసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాశంగా మారింది.
Gaddar Meet Amit sha: గద్దర్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు. ప్రజా యుద్ద నౌకగా పిలుచుకునే గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్.. వామపక్ష ఉద్యమాలు,తన ఆట పాటలతో కోట్లాది మందిని కదిలించారు. మొదటి నుంచి లెఫ్ట్ ఉద్యమాల్లో కీలకంగా ఉన్నారు గద్దర్. నక్సల్ బరి ఉద్యయంలో పని చేశారు. గద్దర్ రాసిన పాటలు జనాలను ఉపేశాయి. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. గద్దర్ పేరు వినగానే మొదట ఎర్రజెండానే గుర్తుకు వస్తుంది. వామపక్ష భావజాలంతో ఆయనకు అంతగా అనుబంధం ఉంది. గతంలో గద్దర్ పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన శరీరంలో ఇంకా ఓ బుల్లెట్ ఉంది. ప్రభుత్వమే తనను హత్య చేయాలని చూసిందని గద్దర్ ఆరోపిస్తూ ఉంటారు. గద్దర్ పై తెలుగు రాష్ట్రాల్లోనే కాక పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.
అయితే ఇటీవల కాలంలో గద్దర్ వ్యవహారశైలిలో మార్పు వచ్చింది. గతంలో నాస్తికుడిగా ఉన్న గద్దర్.. ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు. అంతేకాదు ఆయన రాజకీయ వైఖరిలోనూ మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు గద్దర్. గద్దర్ వైఖరిపై చర్చ సాగుతుండగానే.. తాజాగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడం సంచలనంగా మారింది. కరుడుగట్టిన వామపక్ష వాదిగా ఉన్న గద్దర్.. కరుడుగట్టిన కాషాయవాదిని కలుసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాశంగా మారింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తరుచూ కలుస్తున్నారు గద్దర్. దీంతో గద్దర్ తీరును వామపక్షవాదులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన అమిత్ షాను ఎందుకు కలిశారని కొందరు నిలదీశారు. మరికొందరు మాత్రం హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రిని కలిస్తే తప్పేంటని సమర్థించారు. తాజాగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు గద్దర్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఎందుకు కలిశానో క్లారిటీ ఇచ్చారు.
పాటే ప్రాణంగా జీవించిన తనపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని చెప్పారు గద్దర్. తనపై అనేక అక్రమ, తప్పుడు కేసులు ఉన్నాయన్నారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని
కేంద్రాన్ని కోరానని గద్దర్ వెల్లడించారు. అందుకోసమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశానని తెలిపారు. తుక్కగూడ సభలో అమిత్ షాను కలిసి తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని వినతిపత్రం ఇచ్చానని గద్దర్ వివరించారు. తన వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేసులను ఎత్తివేయాలని కోరానని చెప్పారు. అయితే తాను ఇచ్చిన వినతి పత్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి చూశారో లేదో తనకు తెలియదన్నారు. అది తెలుసుకోవడానికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశానని చెప్పారు. పాట ప్రతిపక్షం లాంటిదని.. దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు గద్దర్. తన ఏజ్ 75 సంవత్సరాలు అయితే.. తన బాడీలోని బుల్లెట్ వయసు 25 ఏళ్లని గద్దర్ చెప్పారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను తుక్కుగూడలో నిర్వహించారు. ఈ సభకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. ఈ సభకే వచ్చారు గద్దర్. బీజేపీ సభా వేదిక దగ్గర గద్దర్ చూసినవాళ్లంతా షాకయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. గద్దర్ గురించి అమిత్ షా కు చెప్పారు. తర్వాత తాను తీసుకొచ్చిన కవర్ ను అమిత్ షాకు ఇచ్చారు గద్దర్. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా గద్దర్ వివరణ ఇవ్వడంతో అసలు విషయం బయటికి వచ్చింది.
READ ALSO: KCR DELHI TOUR: కేసీఆర్ చెప్పే సంచలనం ఇదేనా? బీజేపీకి గండమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook