Gaddar Last Statement: గద్దర్.. తుది వరకు పోరాటమే.. జనం కోసం ఆరాటమే..
Gaddar Last Statement: గద్దర్ తన చివరి కోరిక నెరవేరకుండానే నింగికెగిశారు. ఆస్పత్రిలో అనారోగ్యంతో యుద్ధం చేస్తూనే మళ్లీ తిరిగొచ్చి ప్రజల కోసం యుద్ధం చేస్తానని ప్రకటించిన గద్ధర్.. చికిత్స పొందుతూ కన్నుమూయడం యావత్ తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఒక్క తెలంగాణకే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉద్యమ కెరటం.. విప్లవాల ముద్దు బిడ్డ మన గద్దర్.
Gaddar Last Statement: గద్దర్ తన చివరి కోరిక నెరవేరకుండానే నింగికెగిశారు. ఆస్పత్రిలో అనారోగ్యంతో యుద్ధం చేస్తూనే మళ్లీ తిరిగొచ్చి ప్రజల కోసం యుద్ధం చేస్తానని ప్రకటించిన గద్ధర్.. చికిత్స పొందుతూ కన్నుమూయడం యావత్ తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఒక్క తెలంగాణకే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తన అవసరం ఉన్న ప్రతీ చోట ఉవ్వెత్తున్న ఎగిసిపడిన ఉద్యమ కెరటం.. విప్లవాల ముద్దు బిడ్డ మన గద్దర్. అటువంటి గద్దర్ ఇక లేరంటే ఎందుకో నమ్మబుద్ది కావడం లేదు. ఈ సందర్భంగా గద్దర్ చివరిసారిగా విడుదల చేసిన ఓ ప్రకటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. గుండెలు పిండేస్తోంది.
గద్దర్ చికిత్స పొందుతూ చనిపోవడానికి ముందు తన పరిస్థితి గురించి, తన ఆరోగ్యం గురించి ఓ ప్రకటన విడుదల చేశారు. తన అనారోగ్య సమస్య, తనకు జరుగుతున్న చికిత్స, తనకు చికిత్స అందిస్తున్న వైద్యుల వివరాలను వెల్లడిస్తూ చేసిన ఈ ప్రకటనలో తాను ఏం చెప్పదల్చుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. మొత్తం ప్రపంచానికి గద్దర్‌గానే పరిచయం ఉన్న తన గురించి ఈ ప్రకటన ద్వారా మరోసారి తన అసలు పేరుతో పరిచయం చేసుకున్నారు.
గుమ్మడి విఠల్ నాపేరు. గద్దర్ నాపాట పేరు అంటూ మొదలైన ఆ ప్రకటనలో గద్దర్ అనేకానేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గద్దర్ ఈ లోకాన్ని విడిచిపోయిన నేపథ్యంలో గద్దర్ ప్రకటనను యధావిధిగా మీకు అందిస్తున్నాం.
గుమ్మడి విఠల్ నాపేరు. గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను. నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/ బేగంపేటలోని శ్యామకరణ్ రోడులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో ఇటీవల చికిత్స కోసం చేరాను. జూలై 20వ తేదీ నుండి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను.
ఇది కూడా చదవండి : Gaddar: మూగబోయిన ఉద్యమ గళం.. నేడు అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు..
గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాద్ రావు, డాక్టర్ డి. శేషగిరి రావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప (అనిస్తీషియా), డాక్టర్ ప్రఫుల్ చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్య సహాయం అందుతున్నది. గతంలో నాకు డాక్టర్ జి. సూర్య ప్రకాశ్, బి. సోమరాజు వైద్యం చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను అంటూ గద్దర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తన యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్‌పేట్, హైదరాబాద్‌కు చెందిన ఫ్రంట్ ఆఫీస్ నెంబర్ మీ సందేశాలు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ ఆస్పత్రి నెంబర్ సైతం అందించిన గద్దర్.. ఇట్లు ప్రజా గాయకుడు, మీ గద్దర్ అంటూ తన ప్రకటనను ముగించారు. మళ్లీ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను అని చెప్పిన గద్దర్ ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గద్దరన్న ఇలా ఉన్నట్టుండి తమని విడిచివెళ్లిపోతారని అనుకోలేదని ఉద్యమ గొంతుకలు బోరుమంటున్నాయి.. తమకిక దిక్కెవరంటూ పీడిత ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ సమస్యలపై పోరాటం చేసేదెవరు అని బడుగుబలహీన వర్గాలు తల్లడిల్లిపోతున్నాయి.
ఇది కూడా చదవండి : Revanth Reddy About Gaddar: గద్దర్ అన్న ఆశయం అదే.. ప్రజా గాయకుడి గురించి రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి