Revanth Reddy About Gaddar: గద్దర్ అన్న ఆశయం అదే.. ప్రజా గాయకుడి గురించి రేవంత్ రెడ్డి

Revanth Reddy About Gaddar: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలుపెట్టి గద్దర్.. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొనియాడారు. 

Written by - Pavan | Last Updated : Aug 7, 2023, 11:06 AM IST
Revanth Reddy About Gaddar: గద్దర్ అన్న ఆశయం అదే.. ప్రజా గాయకుడి గురించి రేవంత్ రెడ్డి

Revanth Reddy About Gaddar : నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలుపెట్టి గద్దర్.. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొనియాడారు. గద్దర్ పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలిచి గద్దర్ గళమై వినిపించారు. భూమి, ఆకాశం ఉన్నంతవరకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంటుంది. గద్దర్ అన్నతో నాకు వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉంది. నాలాంటి వారికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవి, కళాకారుడు ఆయన అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. 

తుది దశ తెలంగాణ ఉద్యమం కోసం చివరి శ్వాస వరకు ఎంతో పరితపించిన గద్దర్ అన్న దొరల నుంచి తెలంగాణను కాపాడాలని ఎంతో ఆరాటపడ్డారు. అందులో భాగంగానే తుది దశ ఉద్యమానికి అండగా నిలబడ్డారు. రాహుల్ గాంధీపై అభిమానంతో గద్దర్ అన్న పెట్టిన ముద్దు ఇంకా తడి ఆరలేదు. అలాంటి గద్దర్ అన్న భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. గద్దర్ అంత్యక్రియలకు వేలాదిగా తరలివచ్చి గద్దర్‌కు నివాళులు అర్పించండి. తుది దశ ఉద్యమానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నింపుకుని ఆయన కలలు కన్న తెలంగాణకై పోరాడదాం అని గద్దర్ అభిమానులకు, ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి : Gaddar Last Statement: గద్దర్.. తుది వరకు పోరాటమే.. జనం కోసం ఆరాటమే..

ప్రజా గాయకుడు గద్దరన్న అంతిమ యాత్ర రేపు ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఉన్న గద్దర్ పార్థీవదేహాన్ని ఇక్కడి నుండి బషీర్‌బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం చౌరస్తా మీదుగా గన్ పార్క్‌కి తరలిస్తారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచి పాటలతో నివాళులు అర్పిస్తారు. అనంతరం అమరవీరుల స్థూపం నుండి భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి పార్థివదేహం తరలిస్తారు. భూదేవినగర్‌లోని మహాభారతి విద్యాలయం అవరణలో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు.

ఇది కూడా చదవండి : Gaddar Last Interview With Zee Telugu News: గద్దర్ చివరి ఇంటర్వ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News