హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపిలో చేరారు. బీజేపిలోకి వెళ్తూ వెళ్తూ.. కాంగ్రెస్ పార్టీపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరి నచ్చకే తాను పార్టీ వీడుతున్నానని చెప్పిన సర్వే సత్యనారాయణ.. ఇంకా నాతో చాలా మందే ఉన్నారని, త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోజీ విధానాలు తనని ఆకర్షితుడిని చేశాయని సర్వే సత్యనారాయణ స్పష్టంచేశారు. మరోవైపు సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నారని తెలిసిన మరుక్షణమే కాంగ్రెస్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్టీ మారిన సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ దేశాన్ని గొప్ప స్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తున్నారని.. అందుకే తాను కూడా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నాయకత్వం నచ్చి తాను ఆ పార్టీలో ( Sarve Satyanarayana joins BJP ) చేరుతున్నానని అన్నారు. తెలంగాణలోనూ బీజేపి నాయకత్వం నిరుపేదలకు సేవ చేసేందుకు కృషిచేస్తుండటమే తన నిర్ణయానికి మరో కారణమైందని సర్వే సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.


Also read : TRS MP D Srinivas: ఎక్కడి అభివృద్ధి.. ఏం అభివృద్ధి..: సీఎం కేసీఆర్‌పై సొంత పార్టీ ఎంపీ డిఎస్ ఘాటు వ్యాఖ్యలు


Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి