GHMC Elections: తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
తెలంగాణలోని మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకుగానూ 8 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు.
- Also Read : GHMC Elections: నోడల్ అధికారుల నియామకం
ఈ మేరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని పార్టీలతో ఇదివరకే చర్చించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఓటింగ్‌ను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకుగానూ 8 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి.
- Also Read : COVID19: తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
బీజేపీ మాత్రం కరోనా వ్యాప్తి సమయంలోనూ ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరపాలని కోరడం గమనార్హం. నవంబర్ తొలివారంలో లేక రెండో వారంలో గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. గత ఎన్నికలతో పోల్చితే అధికార టీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గేలా కనిపిస్తున్నాయి. అయితే ఇతర పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe