తాను ప్రదర్శించిన అత్యుత్సాహం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) జరిమానాకు దారి తీసింది. ప్రముఖ దర్శకుడు వర్మకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) మరోసారి జరిమానా విధించింది. జీహెచ్ఎంసీ నిబంధనల్ని పాటించకుండా బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లను అంటించినందుకు వర్మకు బుధవారం నాడు రూ.88వేల రూపాయల (RGV Fined) ఈ చలానా రాశారు. Rhea Chakraborty సుశాంత్‌ను వేధించింది: అంకితా లోఖాండే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్‌డౌన్‌లో అన్నీ తానే తొలి ఆవిష్కరణ, ప్రయత్నాలు అంటూ దర్శకుడు వర్మ పలు విషయాలను ఇదివరకే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో తాను తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమా పోస్టర్‌ను ట్వీట్ చేస్తూ.. లాక్‌డౌన్‌లలో తొలి పోస్టర్ అని తెలిపాడు. ఇది గమనించిన ఓ నెటిజన్ డైరెక్టర్ వర్మ పోస్టును సీఈసీ - ఈవీడీఎం ఖాతాకు జోడించి ఫిర్యాదు చేశాడు. Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే.. 


తొలుత దీనికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రూ.4 వేల జరిమానా విధించింది. అయితే అదే జూబ్లీహిల్స్ ప్రాంతంలో మరో 30కి పైగా పోస్టర్లను అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ దర్శకుడు వర్మకు రెండోసారి రూ.88వేల జరిమానా (GHMC Fines RGV) విధించింది.  పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్   
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు