హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేశారన్న పకడ్బందీ సమాచారంతో నలుగురిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ సోమవారం అరెస్టు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరెస్టు చేసిన వారి నుంచి రూ .1.38 కోట్లకు పైగా విలువైన 3,099 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని, ఈ క్వార్టెట్ జాతీయ రహదారి( 44) బెంగళూరు నుండి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్నట్లు పకడ్బందీ సమాచారంతో తమ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారని తెలిపారు. నగర శివారులోని చిల్కమరి వద్ద గల రాయకల్ టోల్ ప్లాజా వద్ద నిఘా ఉంచామని, కాగా, మొదటగా ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నామని, అనంతరం క్యాబ్‌లో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు.


ఈ నలుగురు వ్యక్తుల నుండి 3099 గ్రాముల బరువున్న, 999 స్వచ్ఛత కలిగిన 31 విదేశీ బంగారు బిస్కెట్లను తీసుకెళ్తున్నట్లు గుర్తించామని అన్నారు. అయితే వీటికి సంబంధించి వారివద్ద సరైన పత్రాలు లేవని పోలీసులు అధికారులు పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..