500 Bonus For Paddy: తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త చెప్పింది. మొన్నటి వరకు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఖరీఫ్ పంట నుంచే సన్న వడ్లకు క్వింటాకు రూ.500 ప్రకటించింది. ఖరీఫ్‌ అంటే అక్టోబర్‌ నెల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సన్న వడ్లు పండించిన రైతులకు ఈ బోనస్‌ అందించనున్నామని సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఇచ్చిన హామీ మేరకు మొదటగా మహిళలకు పెద్ద పీట వేస్తూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత రూ.500 సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత సదుపాయం కల్పించారు. ఇక త్వరలో మహిళల ఖాతాల్లో నెలకు రూ.2500 జమా చేసేందుకు కూడా కసరత్తు చేస్తోంది. 


ఇదీ చదవండి: గంగమ్మ ఒడికి గణపయ్య పయనం.. కనులారా చూతము రారండి  


మరోవైపు తాజాగా రేషన్‌కార్డులు కూడా వచ్చే నెల అక్టోబర్‌ నెలలోనే కొత్తవి జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా తాము ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తమ్‌ చెప్పారు. సన్న వడ్లకు కనీస మద్ధతు ధరతోపాటు బోనస్‌గా రూ.500 అందించనున్నారు. నిన్న సాయంత్రం ఉత్తమ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి జరిగిన మీడియా సమావేశంలో నిర్వహించారు.


ఇదీ చదవండి: రూ.కోటితో రంగంలోకి మాజీ సీఎం జగన్‌.. వైసీపీ నాయకుల నెల జీతంతో


అయితే, ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కానీ, అందరికీ రుణమాఫీ జరగలేదు. ఇక నిన్న జరిగిన సమావేశంలో కొత్త రేషన్‌ కార్డుల జారీ విధివిధానాలపై కూడా చర్చించింది. దాదాపు అన్ని పథకాలకు రేషన్‌ కార్డు లింక్‌ పెట్టేసరికి ఇప్పటికీ చాలామంది రేషన్‌ కార్డులు లేనివారు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఎన్నో ఎళ్లుగా రేషన్‌కార్డులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో అభయహస్తంలో భాగంగా ఎన్నో లక్షల మంది రేషన్‌ కార్డు ఇతర పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. అది ఎప్పుడు అమలు అవుతుందో చూడాలి. కొన్ని వర్గాల ప్రకారం అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీ ఉండవచ్చని తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.