TSPSC Notifications: నిరుద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. మరో 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ..
TS Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. న్యూ ఇయర్ కానుకగా మరో నాలుగు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ.
TSPSC latest Notifications: తెలంగాణలో కొలువుల మోత మోగుతుంది. వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కేసీఆర్ సర్కారు. గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల ప్రకటనలు జారీ చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా మరో నాలుగు జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. డిగ్రీ కళాశాలలకు సంబంధించి 544 పోస్టులు, పురపాలక శాఖలో 78 పోస్టులు, విద్యాశాఖలో 71 పోస్టులు, 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల చేసింది.
** మున్సిపల్ శాఖలో 78 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు.
** విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ ఖాళీలను భర్తీ చేయనుండగా.. ఇందులో ఇంటర్ కమిషనరేట్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 31 లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులు స్వీకరించనుంది.
** డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజకల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి 544 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటికి జనవరి 31 నుంచి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 20. మే లేదా జూన్ లో నియామక పరీక్ష ఉంటుందని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
** ఏఎంవీఐ పోస్టులకు సంబంధించి 113 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి మే లేదా జూన్ లో పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాల కోసం tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.
Also Read: Group-3 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల..
Also Read: Group 2 Notification: నిరుద్యోగులకు కేసీఆర్ న్యూఇయర్ గిఫ్ట్.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook