Group-3 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల..

Group-3 Jobs: కొత్త ఏడాది ప్రారంభానికి ముందే నిరుద్యోగుల్లో కేసీఆర్ ప్రభుత్వం జోష్ నింపింది. తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 08:28 AM IST
  • గ్రూప్-3లో 1,365 పోస్టులు
  • నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
  • జనవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Group-3 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల..

Group-3 Notification in Telangana: కేసీఆర్ సర్కారు నిరుద్యోగులకు కొత్త ఏడాది 2023కు ముందు మరో గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబరు 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా శుక్రవారం గ్రూప్ 3 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మెుత్తం 26 ప్రభుత్వ విభాగాల్లో 1365 పోస్టుల గ్రూప్-3 కొలువుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో  ఎక్కువగా అంటే 712 ఆర్థిక శాఖలో ఉన్నాయి. 

జనవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ వివరాలను జనవరి 24 నాటికి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అయితే ఈ పరీక్ష యెుక్క ప్రిలిమ్స్ తేదీని టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. డిసెంబరు 1న గ్రూప్-4 ప్రకటన జారీ చేసిన టీఎస్పీఎస్సీ.. ఈ నెల చివరిలో వరుసగా గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 

తగ్గిన గ్రూప్-4 పోస్టులు
ఇదిలా ఉండగా.. గ్రూప్‌- 4 ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి నుంచి మెుదలైంది. కమిషన్ అధికారులు దరఖాస్తులో సాంకేతిక తప్పిదాలు జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ ఏర్పాట్లను టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. గ్రూప్-4కు మెుదట 9168 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడగా... తాజాగా వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ప్రకటనలో 8039 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే 1129 పోస్టులు తగ్గాయి. 

Also Read: Group 2 Notification: నిరుద్యోగులకు కేసీఆర్ న్యూఇయర్ గిఫ్ట్.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News