Sheep distribution from Oct 24 in Telangana: గొల్ల, కురుమలకు ఆదాయం పెంచి ఆర్థిక స్వావలంభన కలిగించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అక్టోబర్ 24 నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. గొల్ల, కురుమ సామాజిక వర్గాల నుంచి అర్హులైన 7 లక్షల మందికి గొర్రెలు పంపిణీ (Gorla pampini) చేయనున్నట్టు తెలిపారు. ఒక్కో యూనిట్‌కి రూ. 1.25 లక్షల చొప్పున వెచ్చిస్తూ.. మొత్తం ఒక లక్ష యూనిట్లు అందించనున్నట్టు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్కో యూనిట్‌కి వెచ్చించే రూ.1.25 లక్షల్లోంచి ప్రభుత్వం 75 శాతం భరించనుండగా మిగతా మొత్తాన్ని లబ్ధిదారుల నుంచి వసూలు చేయనున్నట్టు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ఒక్క యూనిట్‌కి వెచ్చించే మొత్తాన్ని రూ.1.25 లక్షల నుంచి రూ1.75 లక్షలకు పెంచినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) స్పష్టంచేశారు.


Also read : Huzurabad By Election: బీజేపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్


అలాగే చేప పిల్లలను (Fish seedlings) చెరువుల్లో వదిలే కార్యక్రమాలపై దృష్టి సారించాల్సిందిగా సంబంధిత అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains in Telangana) చెరువులు, రిజర్వాయర్లు నిండి పొంగి ప్రవహిస్తుండంతో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, నవంబర్ 15లోగా ఆ పని పూర్తయ్యేలా మత్స్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.


Also read : EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు


Also read : Girls can apply to Military College: ఆర్​ఐఎంసీలో ప్రవేశాలకు నోటిఫికేషన్​- దరఖాస్తు ఎలా చేయాలంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook