Girls can apply to Military College: ఆర్​ఐఎంసీలో ప్రవేశాలకు నోటిఫికేషన్​- దరఖాస్తు ఎలా చేయాలంటే?

Military College for Girls: డెహ్రాడూన్​లోని రాష్ట్రీయ ఇండియన్​ మిలిటరీ కాలేజ్​ (ఆర్​ఐఎంసీ)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది. అడ్మిషన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​కు దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 05:20 PM IST
  • 7వ తరగతి బాలికలకు గుడ్ న్యూస్
  • ఆర్​ఐఎంసీలో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదల
  • దరఖాస్తులు స్వీకరిస్తున్న టీఎస్​పీఎస్​సీ, ఏపీపీఎస్​సీ
  • అప్లికేషన్ పంపేందుకు నవంబర్ 15 చివరి తేదీ
Girls can apply to Military College: ఆర్​ఐఎంసీలో ప్రవేశాలకు నోటిఫికేషన్​- దరఖాస్తు ఎలా చేయాలంటే?

RIMC Admissions: తెలుగు రాష్ట్రాల్లో ఏడో తరగతి చదువుతున్న బాలికలకు గుడ్​ న్యూస్​. డెహ్రాడూన్​లోని రాష్ట్రీయ ఇండియన్​ మిలిటరీ కాలేజ్​ (ఆర్​ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ (RIMC Notification) విడుదలైంది.

ఆర్​ఐఎంసీలో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్​ కోసం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్​ సర్వీస్ కమిషన్​లు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఆర్హతలు ఏమిటి? అప్లయి ఫీజు ఎంత? ఎంట్రెన్స్​ టెస్ట్​ తేదీ వివరాలు గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

ఆర్​ఐఎంసీ అధికారిక పోర్టల్​లో నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారమ్స్ ​ డౌన్​లోడ్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫారమ్స్​తో పాటు.. ఎగ్జామ్ మోడల్ పేపర్స్​ కూడా డౌన్​లోడ్​ చేసుకునే వీలుంది.

Also read: Telangana Inter exams : తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలను ఆపలేమన్న హైకోర్టు

దరఖాస్తుతో పంపాల్సిన డాక్యుమెంట్స్

  • బర్త్ సర్టిఫికేట్
  • నివాస ధృవీకరణ పత్రం
  • ప్రస్తుతం చదువుతున్న స్కూల్​ ప్రిన్సిపల్ నుంచి ఫొటోతో కూడిన ధృవీకరణ పత్రం. ఇందులో స్కూల్​ రికార్డ్స్ ప్రకారం పుట్టిన తేదీ వివరాల వంటివి ఉండాలి.
  • ఆధార్​ జిరాక్స్​ జిరాక్స్​ తప్పని సరి.
  • రెండు పాస్​పోర్ట్ సైజు ఫొటోలు

Also read: YS JAGAN Review:ఆ నియామకాలకు నవంబర్ 30 డెడ్‌లైన్ విధించిన జగన్

ఫీజులు..

జనరల్​ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ- ఎస్టీ అభ్యర్థులు 555 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

అర్హతలు.

ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలనుకునే విద్యార్థినుల ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2022 జులై 1 నాటికి ఏడో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు టెస్ట్ రాసే సమయానికి పదకొండున్నరేళ్లు నిండి ఉండాలి. 13 ఏళ్లు దాటకూడదు. స్పష్టంగా చెప్పాలంటే.. 2009 జులై 2 కన్నా ముందు.. 2011 జనవరి 1 తర్వాత పుట్టిన బాలికలు ఎగ్జామ్ రాయడం కుదరదు.

Also read: Prakash raj MAA Controversy: తెరపైకి మళ్లీ 'మా' రగడ.. ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్

టెస్ట్ ఎలా ఉంటుంది?

ఇంగ్లీష్​, మ్యాథ్స్, జనరల్​ నాలెడ్జ్​లకు సంబంధించి ఎగ్జామ్ (RIMC Admission test) ఉంటుంది. మొత్తం 400 మార్కుల పరీక్ష ఇది. ఇందులో మాథ్స్​కు 200 మార్కులు, ఇంగ్లీష్​కు 125 మార్కులు, జనరల్ నాలెడ్జ్​కి 75 మార్కుల చొప్పున కేటాయించింది ఆర్​ఐఎంసీ.

మ్యాథ్స్ పేపర్​కు గంటన్నర సమయం ఉంటుంది. దీనిని హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చు. జనరల్ నాలెడ్జ్​ పేపర్​కు గంట సమయం ఉంటుంది దీనిని కూడా ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో రాయొచ్చు. ఇంగ్లీష్​ పేపర్​కు రెండు గంటల సమయం ఉంటుంది.

తెలంగాణలో దరఖాస్తు చేసిన వారికి పరీక్ష కేంద్రం హైదరాబాద్​లో ఉంటుంది. ఏపీలో విద్యార్థులకు పరీక్ష కేంద్రం విజయవాడ.

ఎంపిక విధానం..

మూడు పేపర్లలో కనీసం 50 శాతం చొప్పున మార్పులు సాధించాలి. 50 శాతం మార్కులు సాధించి అభ్యర్థులకు మెడికల్ టెస్ట్​, వైవా నిర్వహించిన తర్వాత అడ్మిషన్​ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Also Read : KBC 13: సెక్యూటరీ గార్డ్ కొడుకు రూ. కోటి గెలిచాడు

ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలు...

దరఖాస్తు పంపించేందుకు చివరి తేదీ.. నవంబర్ 15.
ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ- డిసెంబర్ 18
దరఖాస్తును తెలంగాణలో విద్యార్థులు హైదరాబాద్​, నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్​ సర్విస్ కమిషన్​ (టీఎస్​పీఎస్​సీ)కు పంపాలి.
ఆంధ్రప్రదేశ్​లోని విద్యార్థులు విజయవాడలోని ఆర్​టీఏ కార్యాలయం దగ్గర ఉన్న ఏపీపీఎస్​సీ కార్యాలయానికి దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.

Also Read : IPL 2022 new teams: ఐపిఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీలు.. Ahmedabad, Lucknow

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News