Minor Girl Gang Rape: ఎమ్మెల్యే కొడుకు ఎక్కడ? గ్యాంగ్ రేప్ ఘటనలో ఏం జరిగింది ? నివేదిక కోరిన గవర్నర్ తమిళి సై..
Minor Girl Gang Rape : తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు సాగే కొద్ది సంచలన అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. బాలికను ఎలా ట్రాప్ చేశారు.. గ్యాంగ్ రేప్ తర్వాత నిందితులు ఏమి చేశారు వంటి విషయాలు బయటికి వస్తున్నాయి
Minor Girl Gang Rape: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు సాగే కొద్ది సంచలన అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. బాలికను ఎలా ట్రాప్ చేశారు.. గ్యాంగ్ రేప్ తర్వాత నిందితులు ఏమి చేశారు వంటి విషయాలు బయటికి వస్తున్నాయి. తమకు లభించిన ఆధారాలతో బాధితురాలిని ప్రశ్నిస్తూ మరింత సమాచారం రాబడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. గ్యాంగ్ రేప్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె నివేదిక కోరారు. రెండు రోజుల్లో సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , డీజీపీని ఆదేశించారు గవర్నర్ తమిళిసై.
మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. శనివారం ముగ్గురిని అరెస్ట్ చూపించి రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇందులో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. శనివారం మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని గుల్బార్గాలో నాలుగో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని తెలుస్తోంది. మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు పట్టుబడిన వారంతా రాజకీయ కుటుంబాల వారే. తెలంగాణ వక్ప్ బోర్డు చైర్మెన్ కొడుకు., జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కొడుకుతో పాటు సంగారెడ్డికి చెందిన టీఆర్ఎస్ నేత కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కూడా గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ఆధారాలు లేవంటున్నారుయ.
అయితే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు సంచలనంగా మారాయి. ఆ వీడియోలో నిందితురాలితో పాటు కారులో నలుగురు యువకులు ఉన్నారు. వాళ్లలో ఎమ్మెల్యే కడుకు ఉన్నారని తెలుస్తోంది. దీంతో లీకైన వీడియోలో ఉన్న విజువల్స్ అధారంగా మరోసారి బాలికను ప్రశ్నించిన పోలీసులు.. ఎమ్మెల్యే కొడుకును ఈ కేసులో ఆరవ నిందితుడిగా చేర్చబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడు ఇప్పటికే దుబాయ్ వెళ్లిపోయాడని అంటున్నారు. దేశంలో లేడు కాబట్టే పోలీసులకు చిక్కడం లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి.
ఇక మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఇన్నోవా కారును జూబ్లీహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నావో వెహికిల్ దినాజ్ జహన్ పేరుతో ఉంది. గ్యాంగ్ రేప్ తర్వాత వాహనాన్ని దాచిపెట్టారు నిందితులు. శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్ లో ఇన్నావోను దాచినన నిందితులు.. ఆధారాలు దొరకకుండా చెరిపివేశారని తెలుస్తోంది.
Read also: Hyderabad Rape: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్.. హైదరాబాద్ లో మరో దారుణం
Read also: Achyuthapuram Gas Leakage: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి గ్యాస్ లీకేజీ కలకలం... తప్పిన ముప్పు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook