కొత్త మున్సిపల్ బిల్లుపై గవర్నర్ అభ్యంతరం ; సూచనలు ఇవే..
కొత్త మున్సిపల్ యాక్ట్ విషయంలో కేసీఆర్ సర్కార్ దూకుడుకు గవర్నర్ రూపంలో ఊహించని బ్రేక్ పడింది
తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ నరసింహన్ రూపంలో ఊహించని బ్రేక్ పడింది. తెలంగాణ అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ గవర్నర్ స్థాయలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. బిల్లుకు సంబంధించిన కొన్ని సవరణలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ నరిసంహన్ సూచించారు.
గవర్నర్ అభ్యంతరాలు ఇవే...!!
సభ ఆమోదం పొందిన బిల్లులో మున్పిపాలిటీలపై మెజార్టీ అధికారులు కలెక్టరే ఇచ్చింది. జిల్లా కలెక్టర్ కన్నుసన్నల్లోనే మన్సిపాలిటీలు నడవాల్సి ఉంది. చివరకు నాటిన మొక్కలు ఎండిపోయినా కూడా సంబంధిత కార్పోరేటర్ పై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్ కు కట్టబెట్టారు. అవసరమైతే సమస్య తీవ్రతను బట్టి సంబంధిత ప్రజాప్రతినిధిని పదవి నుంచి తప్పించే అధికారాలను జిల్లా కలెక్టర్ కు అప్పగించింది. దీంతో పాటు మన్సిపల్ ఎన్నికల తేదీలను డిసైడ్ చేసే అధికారం ఎన్నికల సంఘంతో ప్రవేయం లేకుండా ప్రభుత్వానికే ఉందంటూ కొత్త మున్సిపల్ యాక్ట్ లో పేర్కొన్నారు. దీన్నికూడా గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు
ఆర్డినెస్స్ జారీ చేసిన టి సర్కార్ !!
ఆగస్ట్ 15 కల్లా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని భావించిన కేసీఆర్ సర్కార్ కు గవర్నర్ అభ్యంతరాలు కొంత షాక్ కు గురి చేసింది. అయితే మన్సిపల్ ఎన్నికల్లో జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో దీనిపై ఎలాంటి చర్చ లేకుండా గవర్నర్ సూచనలను యాథతథంగా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆర్ధినెన్స్ జారీ చేసింది. వచ్చే సమావేశాల్లో దీన్ని సభలో పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంది. అయితే ఈ ఆర్డినెస్స్ ఆధారంగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని టి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.