Guduru Narayana Reddy | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి ప్రజాప్రతినిధులను వణికిస్తోంది. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనావైరస్ బారిన పడి కోలుకుంటుండగా.. తాజాగా టీపీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డికి కూడా కరోనావైరస్ ( Coronavirus positive) సోకింది. కరోనావైరస్ లక్షణాలలో రుచి, వాసన కోల్పోవడం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. తాను కూడా ఉన్నట్టుండి రుచి, వాసన కోల్పోనట్టు గ్రహించిన గూడూరు నారాయణ రెడ్డి అనుమానంతో కరోనా టెస్ట్ ( COVID-19 tests) చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ముందస్తు జాగ్రత్త చర్యగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. Telangana: కరోనా పరీక్షలపై హై కోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా తప్పలేదు:
కరోనావైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని తాను ఎక్కడా అనవసరపు ప్రయాణాలు చేయడం లేదని.. అయితే, ఇటీవల సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అనేక మురికివాడల్లో మాస్కులు పంపిణీ చేస్తూ కోవిడ్-19 నివారణపై అవగాహన చేపట్టామని.. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాల్లోనే పాల్గొన్నానని తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కరోనా సోకక తప్పలేదన్నారు. బహుశా కరోనా వ్యాప్తి కమ్యూనిటీ స్ప్రెడ్ ( Community spread) స్థాయికి చేరుకున్నట్టుంది అని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఒంటి నొప్పులు తప్ప ఇతర ఇబ్బందులు ఏవీ లేవని, తన ఆరోగ్యం నిలకడగానే ఉందని గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. 
 COVID-19: ఏపీలో 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు )


గూడూరు నారాయణ రెడ్డికి కరోనా సోకినట్టు తేలడంతో ఇటీవల ఆయన కలిసిన నేతలు, ఆయనను కలిసిన నేతలు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుండటమే వారి ఆందోళనలకు కారణమైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..