హుజురాబాద్​ ఉపఎన్నిక (Huzurabad By elections) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్(Cheif Minister KCR)​.. దళిత బంధు (Dalit Bandhu) పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వంద చొప్పున పేద దళిత కుటుంబాలను ఎంపిక చేసి పథకం కింద ఈ ఏడాది ఆర్థికసాయం అందించనున్నామని వెల్లడించారు. అయితే ఈ పథకాన్ని దశల వారీగా (అంటే.. తొలుత హుజురాబాద్​లో పైలట్​ ప్రాజెక్టు, ఆ తర్వాత రాష్ట్రమంతటా) అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్​లో దళితబంధు కోసం రూ.30 వేల కోట్లు వరకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bollywood celebrities bodyguards salaries: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ బాడీగార్డులకు కోట్లలో పారితోషికం


అయితే దళిత బంధు (Dalit Bandhu)అమలు నేపథ్యంలో తమకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఇతర సామాజిక వర్గాలతో పాటు విపక్ష నేతలూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో అవసరమైతే ఇతర సామాజిక వర్గాల్లోని పేద ప్రజలకూ భవిష్యత్​లో ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR)​ ప్రకటించారు.
ఇప్పుడు కొత్తగా మరో డిమాండ్​ తెరపైకి వచ్చింది. దళిత బంధు తరహలోనే గల్ఫ్​ దేశాల (Gulf returns workers) నుంచి తిరిగొచ్చిన కార్మికుల ఆదుకునేందుకు కూడా ఈ పథకాన్ని (Gulf Bandhu) అమలు చేయాలని సీఎం కేసీఆర్​కు (CM KCR) కొందరు విన్నవించుకుంటున్నారు. ఉపాధి కోసం గల్ఫ్​ దేశాలకు వెళ్లి పనులు లేక కొందరు తిరిగొస్తుంటే.. మరికొంత మంది మోసపోయి అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే జరిగితే ఉపాధి కోసం తెలంగాణ నుంచి గల్ఫ్​ దేశాలకు వెళ్లిన కార్మికుల లబ్ధి చేకూర్చినట్లు అవుతుంది.
'దళిత బంధు' నిధులు
హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు అమలులో భాగంగా ఇప్పటివరకు దళిత బంధుకు రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పాటు ఇటీవలే మరో రూ.500 కోట్లను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు నిధులు పంపగా.. వాటిని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్​కు (State SC Corporation) అధికారులు బదిలీ చేశారు.


Also Read: Sonu Sood: 'దేశ్ కే మెంటర్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్...సీఎం కేజ్రీవాల్ ప్రకటన


దళితుల కోసం ప్రత్యేక నిధి 
దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, భవిష్యత్​లో ఏదైనా ఆపదకు గురైతే అండగా నిలిచేందుకు వీలుగా "దళిత రక్షణ నిధి" (Dalit Defense Fund) ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అర్హులకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల రూపాయల్లో రూ.10 వేలను లబ్ధిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో రూ.10 వేలు కలిపి ప్రభుత్వం ఆ నిధిని ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ఏ కుటుంబానికి ఆపద వచ్చినా.. దళిత రక్షణ నిధి నుంచి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చేలా ఏర్పాటు జరుగుతున్నాయి.
దళిత బంధు ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షణ కోసం ప్రత్యేక చిప్ అమర్చిన గుర్తింపు కార్డుతో ఫలితాలను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తారు. తెలంగాణ దళితబంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలన్న దృఢసంకల్పంతో ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.


Also Read: Bigg Boss: 'నిద్ర పోవడానికే బిగ్‌బాస్‌ షోకు వెళ్తున్నారు'..బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook