Bollywood celebrities bodyguards salaries: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ బాడీగార్డులకు కోట్లలో పారితోషికం

Bollywood celebrities bodyguards remunerations:  స్టార్ హీరో, హీరోయిన్స్‌కి రక్షణ అందించే బాడీగార్డులు అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు. అలా పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్స్‌కి బాడీగార్డులుగా సెక్యురిటీ ఇస్తున్న వాళ్లు అందుకుంటున్న పారితోషికంపై (Remunerations of Bollywood celebrities bodyguards) ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2021, 04:34 PM IST
Bollywood celebrities bodyguards salaries: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ బాడీగార్డులకు కోట్లలో పారితోషికం

Bollywood celebrities bodyguards remunerations: సినీ ప్రముఖులు జనం మధ్యలోకి వస్తే వారికి సెక్యురిటీ కల్పించడం కష్టమే అనే సంగతి తెలిసిందే. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో, హీరోయిన్స్‌కి సెక్యురిటీ కల్పించడం మరింత కత్తిమీద సాములాంటిదే. కానీ అలాంటి సినిమా స్టార్స్‌కి రోజూ కాపలా కాస్తూ రక్షణ ఇవ్వడం అంటే ఇంకెంత పెద్ద బాధ్యత అవుతుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. అందుకే ఆ స్టార్ సెలబ్రిటీలకు రక్షణ అందించే బాడీగార్డులు కూడా అంతే భారీ పారితోషికం అందుకుంటున్నారు. అలా పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్స్‌కి బాడీగార్డులుగా సెక్యురిటీ ఇస్తున్న వాళ్లు అందుకుంటున్న పారితోషికంపై (Remunerations of Bollywood celebrities bodyguards) ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

ముందుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాడీగార్డు జితేంద్ర షిండే గురించి తెలుసుకుందాం. టైమ్స్ నౌ ప్రచురించిన ఓ కథనం ప్రకారం చాలా కాలంగా అమితాబ్ బచ్చన్‌కి బాడీగార్డుగా డ్యూటీ చేస్తోన్న జితేంద్ర షిండే (Amitabh Bachchan's bodyguard salary) ఏడాదికి రూ. 1.5 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. 

బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మకు ప్రకాశ్ సింగ్ సోను బాడీగార్డుగా ఉన్నాడు. చాలా కాలంగా అనుష్క శర్మకు ప్రకాష్ సింగ్ బాడీగార్డు సేవలు అందిస్తున్నాడు. అనుష్కా శర్మ పెళ్లికి ముందు ఆమెకు మాత్రమే బాడీగార్డ్ అయిన ప్రకాశ్ సింగ్.. ఆ తర్వాతి నుంచి అవసరం అయితే ఆమె భర్త, టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లికి (Anushka Sharma, Virat Kohli) కూడా  పర్సనల్ ప్రొటెక్షన్ అందిస్తున్నాడు. 

జూమ్ టీవీ వార్తా కథనం ప్రకారం అనుష్కా శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు తమ బాడీగార్డు (Anushka Sharma's bodyguard salary) ప్రకాశ్ సింగ్‌కి ఏడాదికి రూ.1.2 కోట్లు పారితోషికం అందిస్తున్నారు.

బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న బాడీగార్డులలో షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ ముందుంటాడు. షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి సింగ్ వార్షిక వేతనం సుమారు రూ. 2.7 కోట్లు (Shah Rukh Khan's bodyguard Ravi Singh salary).

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరాకు పాపులర్ సెలబ్రిటీ బాడీగార్డుగా పేరుంది. తన బాడీగార్డ్ షేరాకు (Salman Khan's bodyguard salary) సల్మాన్ ఖాన్ ఏడాదికి రూ. 2 కోట్లు వేతనం అందిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా 2011లో వచ్చిన బాడీగార్డ్ సినిమాలో టైటిల్ ట్రాక్‌లోనూ షేరా కనిపించాడు.

అమీర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ వేతనం (Aamir Khan's bodyguard salary) ఏడాదికి రూ. 2 కోట్లు. అలాగే అక్షయ్ కుమార్ బాడీగార్డ్ వేతనం రూ. 1.2 కోట్లు. అదే బాడీగార్డ్ అప్పుడప్పుడు అక్షయ్ కుమార్ తనయుడు ఆరవ్‌కి బాడీగార్డునూ కనిపిస్తుంటాడు.

ఇదిలావుంటే, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన చెహ్రె సినిమా ఇవాళ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రుమి జాఫ్రి డైరెక్ట్ చేసిన చెహ్రె థ్రిలర్ మూవీలో (Chehre movie) ఇమ్రాన్ హష్మి, అమితాబ్ కీలక పాత్రలు పోషించారు.

Trending News