Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్ రావు
Harish Rao Hot Comments On Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు రెచ్చిపోయారు. అసలు రేవంత్ ముఖ్యమంత్రేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
Harish Rao: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్‌లో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు హరీశ్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి మాటమీద నిలబడే వ్యక్తిత్వం కాదని గుర్తుచేశారు. గజ్వేల్‌లో శనివారం నిర్వహింఇన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.
Also Read: Revanth Vs KCR: కాంగ్రెస్ పార్టీ ఏమైనా కేసీఆర్ తాగే ఫుల్ బాటిలా?: రేవంత్ రెడ్డి నిలదీత
'మెదక్‌లో రేవంత్ రెడ్డి మరోసారి మూర్ఖత్వాన్ని చాటుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలదీస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతున్నాడు. నీళ్లు, నిధులు అన్ని గజ్వేల్‌కే నా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు. ఇప్పుడేమో గజ్వేల్ అభివృద్ధి ఇందిరాగాంధీ హయాంలో అయింది అని అంటున్నారు' అని హరీశ్ రావు తెలిపారు.
Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి
గజ్వేల్‌కు సిద్దిపేటకు రైలు తీసుకువచ్చింది కేసీఆర్ అని హరీశ్ రావు స్పష్టం చేశారు. మూడు విశ్వవిద్యాలయాలు తెచ్చింది కేసీఆర్ అని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే తమపై నిందలు వేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని, సాగు.. తాగునీరు ఇచ్చింది కేసీఆర్ అని తెలిపారు. మెదక్ జిల్లాను ఏర్పాటు చేసి మంచి ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించిన ఘనత కేసీఆర్‌ది.. సింగూర్ జలాలను మెదక్‌కే దక్కేలా చేసింది కేసీఆర్ అని వెల్లడించారు.
'మమ్మల్ని విమర్శించినప్పుడు మాకు కూడా విమర్శించే హక్కు ఉంది. కానీ మాకు విజ్ఞత ఉంది అని విమర్శించడం లేదు. సీఎం పదవిలో ఉండి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడడం లేదు. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు' అని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు హితవు పలికారు. మోదీతో కుమ్మక్కయింది నువ్వు కాదా? అని నిలదీశారు. రాహుల్ గాంధీ నీకు భాయ్ అయితే, మోదీ బడా భాయ్ అంటావ్ అని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై హరీశ్ రావు నిలదీశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ అమలు చేస్తానని ఇత వరకు అమలు చేయలేదు అని గుర్తుచేశారు. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని, ఇప్పటికీ కూడా మాఫీ చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నావు అని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన 6 గ్యారంటీ ఇప్పటికీ అమలు చేయలేదా? ప్రశ్నించారు.
'బీజేపీకి బేడి అయినా.. కేడీ అయినా అది రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చచ్చుబడేది ఖాయం అని జోష్యం చెప్పారు. 'పార్టీలు మారిన వారిని తక్షణమే అనర్హత వేస్తామని అని రాహుల్ గాంధీ మానిఫెస్టో పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలు మారిన వారికి కండువాలు కప్పుతున్నాడు' అని విమర్శించారు.
'కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పావ్. మాటమీద నిలబడే నైజం నీకు లేదు' అని హరీశ్ రావు తెలిపారు. అత్యధిక ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బీసీలు, ఎస్సీలను రేవంత్ రెడ్డి మోసం చేశాడు అని విమర్శించారు. మైనార్టీల ఓట్లు వేసుకొని గెలిచి మైనార్టీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదని గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter