Rain updates : నగర శివార్లలో పలు చోట్ల భారీ వర్షం
నగర శివార్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం ( Heavy rain ) కురిసింది. ముఖ్యంగా మహేశ్వరం మండలంలోని గ్రామాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ : నగర శివార్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం ( Heavy rain ) కురిసింది. ముఖ్యంగా మహేశ్వరం మండలంలోని గ్రామాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంకొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓవైపు మండుటెండల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగానే మరోవైపు హైదరాబాద్ శివార్లలో నిత్యం ఏదో ఓ చోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
Also read : Rythu bandhu scheme : రైతులకు గుడ్ న్యూస్
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో అకాల వర్షం.. వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ.. పల్లె ప్రాంతాల్లో పలు చోట్ల ఈదురుగాలులతో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో చాలా చోట్ల వరికోతలు పూర్తయి ధాన్యం అమ్ముడుపోగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతుల ధాన్యం మార్కెట్ యార్డుల్లోనే కొనుగోలుకు సిద్ధంగా ఉంది. దీంతో అకాల వర్షాలు తమని ఇబ్బందులపాలు చేస్తాయేమోననే ఆందోళన రైతన్నల్లో నెలకొని ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..