హైదరాబాద్: తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించింది. రైతులకు రైతుబంధు పథకం (Rythu bandhu scheme) కింద పంట పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సహాయానికి సంబంధించి రూ. 7 వేల కోట్ల నిధులను సర్కార్ (Telangana govt) విడుదల చేసింది. రైతుబంధు కింద మంజూరైన రూ. 7 వేల కోట్ల నిధులను పంటలు వేసే సమయం నాటికి రైతులకు అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే ఈ ఏడాది కోటీ 40 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించడం జరిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇవే కాకుండా రూ. 25 వేల లోపు ఉండే రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేసేలా తెలంగాణ సర్కార్ రూ.1200 కోట్లు విడుదల చేసింది.
Also read : Vizag tragedy : మృతుల కుటుంబాలకు రూ కోటి ఎక్స్‌గ్రేషియా
రైతు బంధు, రైతు రుణ మాఫీ నిధుల విడుదల విషయమై నేడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.25 వేలలోపు రుణగ్రహీతలుగా ఉన్న 6.10 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. రూ.25 వేల నుంచి రూ.లక్ష లోపు ఉన్న రుణాలను 4 విడతల్లో పూర్తి చేయనున్నట్టు మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..