Heavy Rains in Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బుధవారం తెల్లవారు జామున ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. ఈదురు గాలులు, వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రధాన కూడళ్ల వద్ద వర్షపు నీరు భారీగా నిలిచింది. దీంతో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నగరంలోని సికింద్రాబాద్. మారేడ్ పల్లి, బేగం పేట్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఉప్పల్, తార్నాక, తిరుమల గిరి, బోయిన్ పల్లి, చంపాపేట్, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, నాగోల్, ఎల్బీనగర్, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్, సైదా బాద్, అల్వాల్, అబ్దుల్లా పూర్ మేట్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యింది. దీంతో పాటు మెహదీపట్నం, గోల్కొండ, గోషా మహల్, కార్వాన్, రాజేంద్రనగర్, శంషాబాద్, బండ్లగూడ, గండిపేట్, నార్సింగి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 


పోలీస్ స్టేషన్ పైకప్పు కూలింది..!


భారీ వర్షం ధాటికి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ ఔట్ పోస్ట్ లోని ఉన్న ఫాల్ సీలింగ్ కుప్పకూలింది. పైకప్పు ఊడి పడడం వల్ల పోలీస్ స్టేషన్ లోపలికి వర్షపునీరు వెల్లువలా వచ్చింది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లోని కీలక దస్తావేజులతో పాటు కంప్యూటర్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని పోలీసులు తెలిపారు. 


[[{"fid":"230014","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైన వివరాలు..


సికింద్రాబాద్ - 7.2 సెంటీమీటర్ల వర్షపాతం


బంసిలాల్ పేట్  -  6.7 సెంటీమీటర్లు 


వెస్ట్ మారేడ్ పల్లి  -  6.1 సెంటీమీటర్లు


అల్వాల్  -  5.9 సెంటీమీటర్లు


ఎల్బీ నగర్  -  5.8 సెంటీమీటర్లు


గోషామహల్, బాలానగర్  -  5.4 సెంటీమీటర్లు


ఏఎస్ రావు నగర్  -  5.1 సెంటిమీటర్లు


బేగంపేటలోని పాటిగడ్డ  -  4.9 సెంటీమీటర్లు


మల్కాజ్ గిరి  -  4.7 సెంటీమీటర్లు


సరూర్ నగర్, ఫలక్ నుమా  -  4.6 సెంటీమీటర్లు


గన్ ఫౌండ్రీ - 4.4 సెంటీమీటర్లు


కాచిగూడ, సికింద్రాబాద్  -  4.3 సెంటీమీటర్లు


చార్మినార్  -  4.2 సెంటీమీటర్లు


గుడిమల్కాపూర్, నాచారం  -  4.1 సెంటి మీటర్లు


అంబర్ పేట్ -  4 సెంటీమీటర్లు


అమీర్ పేట్  -  3.7 సెంటీమీటర్లు


ఖైరతాబాద్ - 3.6 సెంటీమీటర్లు


బేగంబజార్, హయత్ నగర్, చిలకనగర్ ప్రాంతాల్లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


Also Read: Heavy Rains: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. జలమయమైన హైదరాబాద్‌ మహానగరం!


Also Read: HRC Complaint On Rahul Gandhi: రాహుల్‌, రేవంత్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు.!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook