Godavari River Floods : హైదరాబాద్ జులై 14: గోదావరి ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద ముప్పు అధికంగా ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నాలుగు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి లోతట్టు ప్రాంతాల్లో చేపడుతున్న సహాయ కార్యక్రమాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు సైతం ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. '' గోదావరిలో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నందున అన్ని ప్రభుత్వ విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు వేగవంతం చేసేలా అదనపు కంటింజెంట్‌ ప్లాన్‌ రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. '' మానవ ప్రాణనష్టాన్ని నివారించేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచించారని జిల్లా కలెక్టర్లకు తెలిపారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం నివేదికలు తెలియజేస్తున్నాయి. దీనికితోడు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండంతో భద్రాచలం వద్ద రేపటికి నీటి మట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందన్నారు. 


ఈ నేపథ్యంలో ముంపుకు గురయ్యే అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ప్రాణ నష్టం అరికట్టేందుకు కృషి చేసిన అధికారులను సోమేష్ కుమార్ అభినందనలు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన చోట జేసీబీలు, జనరేటర్లు, ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసి ఉంచాలని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. ప్రజలకు సహాయ పునరావాసం కల్పించాలని, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు, ఇతర పరికరాలను జిల్లాలకు పంపుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి కలెక్టర్లకు తెలిపారు.


Also Read : Bahubali Scene: 'బాహుబలి' సీన్ రిపీట్.. చుట్టూ ముంచెత్తిన వరద నీరు.. చిన్నారిని తలపై పెట్టుకుని


Also Read : Telangana floods live updates: ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి : ఎమ్మెల్సీ కవిత



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook