Heavy rains man washed away in Hyderabad video goes viral: వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైపోయాయి. ఎక్కడ చూసిన రోడ్లన్ని చెరువులుగా తలపిస్తున్నాయి. అపార్ట్ మెంట్ లలో టెర్రస్ లలో భారీగా వరద నీరు వచ్చి చేరింది.ఈ క్రమంలో ఈరోజు (మంగళ వారం) ఉదయం రెండు గంటల పాటు ఆకాశానికి రంధ్రంపడిందా అన్నట్లు వర్షంకురిసింది. దీంతో జనజీవనం అంతా అస్త వ్యస్తంగా మారిపోయింది. నాలాలు, మ్యాన్ హోల్స్ లు పొంగిపోర్లుతున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఎక్కడ చూసిన రోడ్ల మీద నీళ్లు నిలిచి పోయి ఉండటం కన్పిస్తుంది. ఇదిలా ఉండగా.. వర్షంలో నీటి ప్రవాహానికి ఒక బైక్ కొట్టుకుపోయింది. అక్కడున్న కొంత మంది యువత టూవీలర్ ను కాపాడటానికి ప్రయత్నించారు. వారు కూడా ఆ నీటి ధాటిని కొంత దూరం కొట్టుకుపోయారు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



పూర్తి వివరాలు..


 ఈరోజు (మంగళవారం) ఉదయం తెల్లవారు జామున..సుమారు.. 3 గంటల నుంచి వర్షం మొదలైంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉరుములు,మెరుపులతో వర్షం కురిసింది. అంతేకాకుండా.. గంటలకు 30  నుంచి 40 కిమీ. ల వేగంతో బలమైన గాలులు వీచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ఆగి ఉన్న నీళ్లు కన్పిస్తున్నాయి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో.. ఎక్కడ రోడ్డులు ఉన్నాయో.. కూడా అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. రామ్ నగర్ లో జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.


రోడ్డుపైన వరదనీళ్లు  భీకంగా ప్రవహిస్తుంది. నాలాల నుంచి బలంగా నీటి ప్రవాహాం రోడ్డు మీది నుంచి పోతుంది. ఇంతో అక్కడి నుంచి ఒక స్కూటీ మీద నుంచి రోడ్డుమీద నీటి ప్రవాహాంలో వెళ్తున్నాడు. అతను నీటి ప్రవాహావేగాని బ్యాలెన్స్ కోల్పోయాడు. కొంత దూరం కొట్టుకోని పోయాడు. అతడిని కాపాడటానికి కొంంత మంది యువత.. అక్కడికి వెళ్లగా.. వారు కూడా నీటి ప్రవాహాంలో కొంత దూరం కొట్టుకుని పోయాడు.


Read more; King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..


చివరకు వారు.. ఒక డివైడర్ ను పట్టుకుని తమ ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు కుండపోతగా వాన వల్ల జీహెచ్ఎంసీ టీమ్ అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి