King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

King Cobra: నల్లని కింగ్ కోబ్రా నాగమణిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు.  పాము చీకట్లో నల్లగా మెరుస్తూంది. అది నోట్లో నుంచి నాలుకను బైటకు తీస్తు, చుట్టుపక్కల కోపంతో చూస్తుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 19, 2024, 08:01 PM IST
  • నాగమణిని చుట్టుకుని కూర్చున్న పాము..
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్ లు..
King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

Block King cobra protecting nagamani video goes viral: పాములంటే చాలా మందికి వెన్నులో హడల్. పాములకు చెందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్లు సైతం పాముల వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పాములు వర్షాకాలంలో మానవ ఆవాసాలకు వస్తుంటాయి. ఎలుకల వేటలో అవి వస్తుంటాయి. అడవులు, పొలాలు, దట్టంగా ఉన్న పొదలు ఉన్నచోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పాములను చూడగానే కొంత మంది భయంతోపారిపోతుంటారు. కానీ మరికొందరు దీనికి భిన్నంగా పాములను పట్టుకుంటారు.

 

 

స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. పాములకు ఆపద కల్గించకూడదని చెబుతుంటారు.  పాములకు అపకారం చేస్తే కాలసర్పదోషం చుట్టుకుంటుందని అంటారు. అంతేకాకుండా.. పాములకు చెందిన వెరైటీ వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి. కొంత మంది పాములు పగబడుతాయని చెబుతుంటారు. మరికొందరు పాములకు దైవీ సంపత్తులు ఉంటాయంటారు. పాములు తల మీద నాగమణి ఉంటుందని కూడా చెబుతుంటారు. పాములు బంగారం, నిధులు,నిక్షేపాలకు కాపాలాగా ఉంటాయని చెబుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

నల్లని కింగ్ కోబ్రా..ఒక నాగమణిని చుట్టుకుని కాపాలాగా ఉంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. పాము మాత్రం ఎటు కదలకుండా.. ఆ మణిని చుట్టుకుని కాపాలాగా కూర్చుంది. లైట్ వెలుతురులో.. ఆ పాము మధ్యలో వెలిగిపోతున్న ఒక మణి మాత్రం స్పష్టంగా కన్పిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది.  

మరీ అది నిజంగా సర్పం నాగమణికి కాపాలాగా ఉందా.. లేదా మరేంటోకానీ వివరాలు లేవు.  ఈ ఘటనను చూసి చాలా మంది పామును చూస్తేనే భయంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. అదేంలేదని కొట్టిపారేస్తున్నారు. కానీ పాములకు చెందిన అనేక సంఘటనలు ఇప్పటికి కూడా ట్విస్ట్ గానే ఉన్నాయి.  పాములు పగబడతాయని, కాటువేస్తాయని చెప్తున్నారు. పాములు ఇతర పాములను తినేస్తుంటాయి.

పాములు ప్రతి రెండు నుంచి మూడునెలలకు ఒకసారి కుబుసం విడుస్తుందంట. అప్పుడు అది చాలా కోపంగా ఉంటుందంట. అనాదీగా మన సాంప్రదాయంలో పాములను దైవంగా భావిస్తారు. శివుడు తన మెడలోనే, విష్ణువు నాగుల పాన్పుమీద శయనిస్తాడు. అంతేకాకుండా.. సుబ్రహ్మణ్యుడ్ని పాము అవతారంగా భావిస్తారు.

 

Trending News