Hyderabad Rains: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ జంట నగరాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించినట్టే హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలు ఫ్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. రాత్రంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లో ఐఎండీ అంచనా వేసినట్టే భారీ వర్షం ప్రారంభమైంది. రాత్రి 7 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వెంగళరావు నగర్, సనత్ నగర్, అమీర్ పేట్, బోరబండ, మోతీ నగర్, ఎస్సార్ నగర్, మైత్రివనం, రహమత్ నగర్, యూసుఫ్ గూడ, అత్తాపూర్ ప్రాంతాలతో పాటు కూకట్‌పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కోలనీ, కేపీహెచ్‌బి కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నగర ప్రజానీకం ఇబ్బందులు పడుతోంది. 


రాత్రి 7-8 గంటల్నించి ఏకధాటిగా పడుతున్న భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వర్షం నీరు నిండుకుంటోంది. మేడ్చల్, కండ్లకోయ, దుండిగదల్, గండి మైసమ్మ బోరంపేట, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో మురుగు కాల్వలు ఉధృతంగా ప్రవహిస్తూ భయపెడుతున్నాయి. ఇక మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, టోలీచౌకి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకుంటోంది. 


మరోవైపు మూసీ నదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో హైదరాబాద్ కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. అటు ఉస్మాన్ సాగర్, ఇటు హిమాయత్ సాగర్ నుంచి నీళ్లు దిగువకు వదులుతున్నారు. రెండు రిజర్వాయర్లు దాదాపుగా గరిష్ట నీటి మట్టాన్ని చేరుకుంటున్నాయి. మూసీ నదిలోకి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 


రాత్రంతా హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకూ హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. 


Also read: Godavari Floods: పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, భద్రాచలంలో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook