Godavari Floods: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు గత 2-3 రోజుల్నించి పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.
తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద మొన్నటి వరకూ పెరిగిన వరద ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మరోసారి మునుపటికి మించి పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం ఇవాళ రాత్రి అంటే జూలై 26 తేదీ రాత్రి 10 గంటల వరకూ 48 అడుగులకు చేరుకుంది. దాంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాంతో దమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల మధ్య రోడ్లపై వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల తీవ్రత మరో 2-3 రోజులు ఉండటంతో వరద ఉధృతి మరింత పెరగవచ్చని అంచనా. భద్రాచలం వద్ద వరద ఉధృతి మరింత పెరగవచ్చనేది అంచనా. ఈ నేపధ్యంలో లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
ఇక దిగువన ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. రేపు ఉదయానికి ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ కావచ్చు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరో మూడు నాలుగు రోజులు గోదావరికి వరద పెరిగే అవకాశాలున్నాయి. భద్రాచలం వద్ద 50 అడుగుల వరకూ నీటిమట్టం చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
అత్యవసర సహాయక చర్యలకు 6 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. క్షేత్రస్థాయిలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందుతోంది. దీనికోసం 24 గంటలు పనిచేసే స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 1800 425 0101 సంప్రదించాల్సి ఉంటుంది.
Also read: Ap Heavy Rains: ఏపీలో జూలై 29 వరకూ అతి భారీ వర్షాలు, ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook