నల్గొండ: మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రయణ్ కేసుపై పలువురు రాజకీయ నేతలు, సామాజిక వేత్తలు, సినీ నటులు తమదైన శైలిలో స్పందిస్తూ ప్రణయ్ కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ కేసుపై స్పందిస్తూ  హీరో విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ చేశాడు..


ప్రణయ్ పరువు హత్య కేసులో మామ మారుతీరావు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్న విజయ్ దేవరకొండ ..అరబ్ దేశాల్లో అమలు చేస్తున్నట్లుగా అతన్ని బహిరంగంగా ఉరి తీయాలని తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. కూతరు జీవితాన్ని చూసి మురిసిపోవాల్సిన తండ్రి..కసాయివాడిలా మారి అల్లుడిని హతమార్చి అమృత ముక్కుపచ్చలారా జీవితాన్ని నాశనం చేశాడని.. అంలాంటి మృగాన్ని బహిరంగ ఊరిశిక్షే సరైందన్నాడు. మామ మారుతీ రావుతో పాటు హత్యలో పాల్గొన్న అందరీకి బహిరంగంగా ఉరి తీసినప్పుడే కోట్లాది ప్రజల ఆగ్రహవేశాలు చల్లారుతాయని విజయ దేవరకొండ ఉద్వేగంగా స్పందించాడు. ఈ సందర్భంగా అమృతతో సహా ప్రయణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ