Dharani Portal: వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించొద్దు: హైకోర్టు
రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలనతోపాటు పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇటీవల ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana High Court comments on dharani portal: హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలనతోపాటు పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇటీవల ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలు, ఆస్థుల నమోదుపై దాఖలైన పలు పిటిషన్‌లను మంగళవారం హైకోర్టు విచారించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకుండా వ్యవసాయేతర భూముల వివరాలు నమోదు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయని.. కావున అప్పటివరకూ ఎలాంటి వివరాలను నమోదు చేయకూడదని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. Also read: Dharani Portal: ఇకనుంచి ధరణిలో రిజిస్ట్రేషన్లు.. 10 నిమిషాల్లో పని పూర్తి
అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాలను థర్డ్ పార్టీకి ఇవ్వొద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త రెవెన్యూ చట్టం కేవలం సాగు భూముల కోసం మాత్రమేనని.. అయితే ఏ చట్టం ఆధారంగా ఆధార్, కులం వివరాలు సేకరిస్తున్నారని ప్రశ్నించింది. వ్యవసాయేతర ఆస్థుల డేటాకు సంబంధించి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో వివరంగా తెలపాలని కోరింది. ఈ మేరకు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేసి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 20కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. Dubbaka Bypoll: దుబ్బాకలో ప్రారంభమైన పోలింగ్.. క్యూ కడుతున్న ఓటర్లు
Dubbaka Bypoll: ప్రజలకు తెలియాలంటూ.. కేటీఆర్ ఆసక్తికర ట్విట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe