Lady constable Honey trap: లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్‌పై భర్త ఫిర్యాదు
Lady constable`s Honey trap: హైదరాబాద్: ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మహిళా కానిస్టేబుల్‌గా డ్యూటీ చేస్తూ ప్రేమ పేరుతో పెళ్లి కానీ మగవారిని హనీ ట్రాప్ చేసి వరుస పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటోందని పేర్కొంటూ సంధ్యా రాణి అనే యువతిపై షాబాద్ మండలం, హైతబాద్‌కు చెందిన చరణ్ తేజ అనే యువకుడు శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
Lady constable's Honey trap: హైదరాబాద్: ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మహిళా కానిస్టేబుల్‌గా డ్యూటీ చేస్తూ ప్రేమ పేరుతో పెళ్లి కానీ మగవారిని హనీ ట్రాప్ చేసి వరుస పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటోందని పేర్కొంటూ సంధ్యా రాణి అనే యువతిపై షాబాద్ మండలం, హైతబాద్‌కు చెందిన చరణ్ తేజ అనే యువకుడు శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తాను పోలీసు శాఖలో పనిచేస్తున్నానని చెప్పి బాగా డబ్బున్న వారికి వల వేసి మోసం చేస్తోందని, ఇదేమీ ఆమెకి కొత్త కాదని సదరు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలోనూ ఇలాగే ముగ్గురిని పెళ్లి చేసుకుని, వారిలో ఇద్దరికి విడాకులు ఇవ్వగా, మరొకరు ఆమె వేధింపులు భరించలేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు.
ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుందన్నాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ (SC/ST atrocities act) కింద కేసు పెడతానని, లేదంటే ఇద్దరం కలిసి తిరిగిన ఫోటోస్, వీడియోస్ లీక్ చేస్తానని బెదిరింపులకు పాల్పడి పెళ్లికి ఒప్పించిందని చెప్పిన యువకుడు.. ఆ తర్వాతే ఆమెకు గతంలోనే మూడు వివాహాలు జరిగిన విషయం తెలిసిందన్నాడు.
Also read : Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు
సంధ్యారాణిని (Lady constable Sandhya Rani) అలాగే వదిలేస్తే మరింత మందిని మోసం చేస్తుందని వాపోయిన చరణ్ తేజ్.. ఆమె బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే బయటికి రావాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. వరుస పెళ్లిళ్లు మోసాలపై గతంలోనే సదరు యువతిపై ఓ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook