AP Ambulances: తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు స్టే, రాజ్యాంగ ఉల్లంఘన అంటూ వ్యాఖ్యలు
Telangana Government Not Allows AP Ambulances | వరుసగా మూడో రోజు సైతం ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కరోనా పేషెంట్ల అంబులెన్స్‌లను పోలీసులు నిలిపివేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.
Ambulances From AP: కరోనా వైరస్ లాంటి మహమ్మారితో ఇబ్బంది పడుతున్న ప్రజలు పొరుగు రాష్ట్రాలకు చికిత్స నిమిత్తం వస్తుంటే సరిహద్దుల్లో వాహనాలను అడ్డుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఇటీవల ప్రశ్నించింది. అయినప్పటికీ వరుసగా మూడో రోజు సైతం ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కరోనా పేషెంట్ల అంబులెన్స్‌లను పోలీసులు నిలిపివేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.
ఏపీ నుంచి తెలంగాణకు కరోనా చికిత్స కోసం వస్తున్న కరోనా పేషెంట్ల అంబులెన్స్‌లను ఆపకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది. విపత్తులకు సంబంధించిన అంశాలలో సైతం తెలంగాణ ప్రభుత్వం తీరు సరిగా లేదని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. ఏ అధికారంతో అంబులెన్స్‌లను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకోవాలని దేశంలో ఇలాంటి సర్క్యులర్ ఎక్కడా ఇవ్వలేదని తెలంగాణ ధర్మాసనం స్పష్టం చేసింది. తమ సూచనలు, సలహాలను ఉల్లంఘించడంపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: Sputnik V Vaccine Cost: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్
రాష్ట్రంలోని కరోనా పేషెంట్లకు సైతం కరోనా బెడ్లు అందుబాటులో లేవని, ఈ నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చే వారిని బెడ్లు, ఆసుపత్రి అనుమతి లేవనే కారణాలతో అడ్డుకోవడం మంచి నిర్ణయం కాదని పనేర్కొంది. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగాన్ని మీరు మార్చలేరని, జాతీయ రహదారుల చట్టాన్ని సైతం అతిక్రమించడం కిందకి వస్తుందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. కరోనా(COVID-19) ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్‌లు ఉన్నవారిని మాత్రమే తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు. దీనిపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడకూడదని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Also Read: PM Kisan Samman Nidhi Status: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ, PM Kisan స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook