Huzurabad Badvel Bypoll : హుజూరాబాద్‌లో పోటెత్తిన ఓటర్లు.. బద్వేలులో తగ్గిన పోలింగ్
Huzurabad Badvel ByElection Polling: హుజూరాబాద్, బద్వేల్‌లో నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గాల్లో ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Huzurabad Badvel ByElection Polling Updates 86.33% polling in Telanganas Huzurabad, 68.12% in Andhra’s Badvel : తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్, బద్వేల్‌లో నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గాల్లో ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ (Huzurabad bypoll ) ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ (Shashank Goyal) అన్నారు. రాత్రి 7 గంటల వరకు చాలా చోట్ల పోలింగ్ ముగిసిందని చెప్పారు. అప్పటి వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలకు (EVM) భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్ చేస్తామని, కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్‌లు భద్రతను పర్యవేక్షిస్తారన్నారు. స్ట్రాంగ్ రూమ్ (Strong Room) వద్ద అభ్యర్థులు, లేదంటే ఏజెంట్స్ ఉండవచ్చని తెలిపారు. 24 గంటల పాటు నిఘా ఉంటుందన్నారు. "2018తో పోలిస్తే ఉప ఎన్నికలో పోలింగ్ (Polling) శాతం పెరిగింది. ఓటర్లలో చైతన్యం పెరిగినందుకు సంతోషంగా ఉంది. అన్నిపార్టీలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కొన్ని ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు’’ శశాంక్ గోయల్ అన్నారు.
Also Read : WhatsApp to Stop Some Phones: నవంబర్ 1 నుంచి ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు!
ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంటలో రాత్రి 7 తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది అక్కడ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఇల్లంతకుంటలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు ఇళ్లకు వెళ్లిపోయారు. పోలింగ్ (Polling) ముగింపు వేళ రాత్రి 7గంటలకు ఒక్కసారిగా అక్కడికి వచ్చారు. దీంతో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ (Badvel ByElection Polling) శాతం ఈ సారి తగ్గింది. రాత్రి 7గంటల వరకు 68.12శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం భారీగా తగ్గింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు (Badvel) నియోజకవర్గంలో 76.37శాతం పోలింగ్ నమోదైంది.
Also Read : Dengue in Delhi: ఢిల్లీలో డెంగీ విజృంభణ, అప్రమత్తమైన ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook