Dengue in Delhi: ఢిల్లీలో డెంగీ విజృంభణ, అప్రమత్తమైన ప్రభుత్వం

Delhi Dengue crisis: హాస్పిటల్స్‌లో ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు బెడ్స్‌ను డెంగీ రోగుల కోసం కేటాయించాలని నిర్ణయించింది. డెంగీ, (Dengue) మలేరియా, చికున్‌గున్యా బాధితుల కోసం వీటిని వినియోగించాలని ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 10:06 PM IST
  • ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతోన్న డెంగీ కేసులు
  • కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు బెడ్స్‌ను డెంగీ రోగులకు కేటాయింపు
  • ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలేమీ లేవన్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌
Dengue in Delhi: ఢిల్లీలో డెంగీ విజృంభణ, అప్రమత్తమైన ప్రభుత్వం

Dengue crisis: Delhi hospitals to divert one-third of beds reserved for Covid case: ఢిల్లీలో డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం (Kejriwal‌ Government) అప్రమత్తమైంది. హాస్పిటల్స్‌లో ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు బెడ్స్‌ను డెంగీ రోగుల కోసం కేటాయించాలని నిర్ణయించింది. డెంగీ, (Dengue) మలేరియా, చికున్‌గున్యా బాధితుల కోసం వీటిని వినియోగించాలని ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.

ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న అన్ని హాస్పిటల్స్‌లలో డెంగీ రోగుల కోసం తగినన్ని ఏర్పాట్లు చేశామంటూ తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ (Delhi Health Minister Satyendra Jain) తెలిపారు. అలాగే ఏ రోగిని కూడా వెనక్కి పంపే అవసరం ఉండబోదంటూ ఆయన వెల్లడించారు. అయితే కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ఆసుపత్రుల్లో పడకల సమస్య ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ (Satyendra Jain) అన్నారు. కానీ ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అలాంటి సమస్యలేమీ లేవని సత్యేంద్ర జైన్‌ పేర్కొన్నారు. డెంగీ నిర్మూలనకు ఆప్‌ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోందని సత్యేంద్ర జైన్‌ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్‌ (Fogging‌) చేయిస్తున్నట్లు చెప్పారు.

Also Read : WhatsApp to Stop Some Phones: నవంబర్ 1 నుంచి ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు!

ఇక ఢిల్లీలో (Delhi) ప్రస్తుతం డెంగీ (Dengue) విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో మొత్తం వెయ్యికి పైగా డెంగీ కేసులు వెలుగుచూశాయి. అయితే గడిచిన 23 రోజుల్లోనే 665 కేసులు బయటపడ్డాయి. ఇందులో దాదాపు 280 కేసులు గత వారమే నమోదుకావడం గమనార్హం.

Also Read : UK COVID prevalence 1 in 50: బ్రిటన్‌లో ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News