Kaushik Reddy joins TRS ahead of Huzurabad bypolls: కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే టీపీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి.. కొద్దిసేపటి క్రితమే తన అనుచరులు, ఇతర స్థానిక నేతలతో కలిసి వెళ్లి సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని జరిగిన ప్రచారం నేడు నిజమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ తనకే టికెట్ (Huzurabad bypolls TRS ticket) కేటాయిస్తోందంటూ కౌశిక్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తన మిత్రుడితో జరిపిన ఫోన్ సంభాషణ లీకైన సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై అంతకు ముందు నుంచే తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన ఆడియో టేప్స్ (Kaushik Reddy audio tapes leaked) లీకైన అనంతరం మరింత ఆగ్రహం వ్యక్తంచేశాయి. 



Also read : RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు ఆదేశించిన కోర్టు


టీఆర్ఎస్ పార్టీ నేతలను కలుస్తూ ఆ పార్టీకి కోవర్టులా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నావంటూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ తరువాత కొన్ని గంటల్లోనే కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఆ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించడం వెనువెంటనే జరిగిపోయాయి.


Also read: Telangana Minister KTR: ఈటల రాజేందర్ తన తప్పును ఒప్పుకున్నారు, మంత్రి కేటీఆర్ కామెంట్స్


Also read : Etela Rajender Delhi Tour: బీజేపీ నేతగా తొలిసారి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook