RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు ఆదేశించిన కోర్టు

FIR against RS Praveen Kumar: హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగం నుంచి వాల్యుంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న మరుసటి రోజే ఓ పాత కేసులో ఇరుక్కున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు కరీంనగర్ కోర్టు (Karimnagar court) ఆదేశాలు ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2021, 06:32 PM IST
RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు ఆదేశించిన కోర్టు

FIR against RS Praveen Kumar: హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగం నుంచి వాల్యుంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న మరుసటి రోజే ఓ పాత కేసులో ఇరుక్కున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మెజారిటీ ప్రజలు పూజించే హిందు దేవతల పట్ల విద్వేషాలు రెచ్చగొట్టేలా విద్వేషపూరితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారంటూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి గతంలో చేసిన ఫిర్యాదుని విచారణకు స్వీకరించిన కోర్టు ఆయనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాల్సిందిగా త్రీ టౌన్ పోలీసులను ఆదేశించింది. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఫిర్యాదుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇదే ఏడాది ఫిబ్రవరి 16న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపిస్తూ లాయర్ మహేందర్ రెడ్డి మార్చి 22న స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Also read : Mariyamma lockup death case: మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఎస్సై, కానిస్టేబుళ్లపై వేటు

మహేందర్ రెడ్డి (Advocate Bethi Mahender Reddy) ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ.. ఈ కేసులో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

సామాజిక సేవ చేయాలనే లక్ష్యంతో ఐపిఎస్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎదుర్కోనున్న తొలి కేసు ఇదే కావడం గమనార్హం. ప్రవీణ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణకు (IPS Voluntary retirement) చేసుకున్న దరఖాస్తు ఆమోదం పొందిన మరునాడే ఆయనపై ఇలా కేసు నమోదుకు ఆదేశాలు రావడం చర్చనియాంశమైంది. 

Also read : Heavy rains: రాగల మూడు రోజులు వర్షాలు.. రేపు భారీ వర్షాలు

ఇదిలావుంటే, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికే (RS Praveen Kumar in Huzurabad bypoll race) తన ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే తన స్వచ్చంద పదవీ విరమణ (RS Praveen Kumar VRS) విషయంలో వస్తున్న ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేసే ఆలోచన అయితే ఉంది కానీ అందుకు ఇంకా చాలా సమయం ఉంది అని బదులిచ్చారు.

Also read: Delta virus transmits through air: డెల్టా వైరస్ గాలి ద్వారా సోకుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News