BJP Madhavi Latha: బీజేపీ మాధవీలతను హగ్ చేసుకున్న పోలీసు అధికారిణి.. ఎన్నికల సంఘం సీరియస్..వైరల్ గా మారిన ఘటన..
BJP Madhavi Latha: ఎన్నికల ప్రచారంలో పోలీసు అధికారిణి చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే మాధవీలన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమాదేవీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈఘటకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Election Commission Serious On Saidabad ASI: తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న కొలది మరీంత హీట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ తమకు పట్టంకట్టాలని ప్రచారం నిర్వహిస్తుంది.మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అమలుకు సాధ్యంకానీ పథకాలు చెప్పి, అధికారంలోకి వచ్చిందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కన్పించదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఈసారి కాషాయజెండాను తెలంగాణలో ఎగురవేయడం ఖాయమన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేందర్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. రేవంత్ సీటు ఎక్కడ పోతుందో అంటూ అభద్రత భావానికి గురౌతున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైదరాబాద్ ఎంపీ స్థానంపై ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటు మాధవీలత కూడా ప్రచారంలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు. పాతబస్తీలో ఓవైసీ బ్రదర్స్ ను ఏకీపారేస్తున్నారు. ఇన్నేళ్లు పాతబస్తీవెనకబడి ఉండటానికి ఓవైసీ బ్రదర్స్ కారణమంటూ ఆరోపించారు. తాను ఎంపీగా ఎన్నికవ్వగానే.. వక్ఫ్ భూములు ఆక్రమించిన భూములపై ప్రత్యేకంగా, టార్గెట్ చేస్తానంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా హిందువులు, ముస్లింలు అని చూడకుండా అందరికి డెవలప్ మెంట్ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఇదిలా ఉండగా.. మాధవీలత ఇటీవల వివాదాలకు కేరాఫ్ గా మారారు.
పాతబస్తీలో శ్రీరామనవమి శోభయాత్రలో మసీదువైపు విల్లు ఎక్కుపెట్టి బాణం వేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ మారింది. అంతేకాకుండా.. దీనిపై మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు భగ్నం చేయడానికి బీజేపీలు, ఆర్ఎస్సెస్ కుట్రలు చేస్తున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో.. తాజాగా మాధవీలత మరో వివాదానకి కేంద్రంగా మారారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాధవీలత కాస్త అతిగా ప్రవర్తించారు. ఒక పోలీసు అధికారిణినిని ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. సైదాబాద్ కు చెందిన ఏఎస్ఐ ఉమాదేవీ, ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా.. అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ మాధవీలతను ఉమాదేవీ ప్రేమతో మాట్లాడి హగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ ఘటన కాస్త పోలీసుఉన్నతాధికారుల వరకు వెళ్లింది.దీనిపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై హైదరబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏఎస్ఐ ఉమాదేవీని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం ఎన్నికల వేళ తీవ్ర వివాదస్పదంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter