Hyderabad Cop SI Gaddam Mallesh About Heavy Rains: హైదరాబాద్: తెలంగాణ నలు మూలలతో పాటు రాజధాని హైదరాబాద్ లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి వరద వచ్చి నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రత్యేకించి రద్దీ ఉండే ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ ఉండటం, సేఫ్టీ వాల్స్ లేకుండా నాలాలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సైతం నగరవాసులకు వర్షాలు పడినప్పుడు తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ పోలీసు విభాగానికి చెందిన ఎస్‌ఐ గడ్డం మల్లేష్ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను రూపొందించారు. ఆ వీడియోను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనందర్ ట్విటర్ ద్వారా షేర్ చేయగా.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఎస్ఐ గడ్డం మల్లేష్ ఈ వీడియోలో మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్‌ స్తంభాలను టచ్ చేయొద్దని.. వాటితో విద్యుత్‌ షాక్‌ తగిలే ప్రమాదం ఉంటుంది అని చిన్నారులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలని పెద్దలకు సూచించాలని కోరారు. " వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాల నుండి విద్యుత్ ప్రసారించే ప్రమాదం ఉంటుంది అని జనం వారి పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పగలిగితే మేలు ఉంటుంది" అని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు.


" అలాగే నగరంలో గత మూడ్నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత గోడలు.. ముఖ్యంగా మట్టి గోడలు వర్షానికి తడిసి కూలిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. మట్టి గోడలతో నిర్మించిన పాతకాలం నాటి ఇళ్లలో నివసించే ప్రజలు పరిస్థితులు చక్కబడే వరకు రెండు, మూడు రోజులపాటు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి " అని సూచించారు.


ఎన్ని భారీ వర్షాలు పడినా నిత్యం ఆఫీసుతో పాటు బతుకుదెరువు కోసం బయటికి రాక తప్పని పరిస్థితి ఎంతో మందికి ఉంటుంది. అలాంటి వాహనదారులు కొత్త రూట్లలో ప్రయాణించకుండా రోజూ వెళ్లే రహదారుల్లోనే రాకపోకలు సాగించాలన్నారు. రోజూ వెళ్లే రూట్లో ఉండే మ్యాన్‌హోల్స్‌పై ఒక అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో ఎస్‌ఐ మల్లేష్ ఈ సూచన చేశారు. 



ఇది కూడా చదవండి : Heavy Rains Alert: తెలంగాణలో మరో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎక్కడెక్కడంటే


భారీ వర్షాలు, ఈదురు గాలులకు చెట్లు కూలడం, కొమ్మలు విరిగిపోవడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి కనుక చెట్ల కింద ఆశ్రయం పొందం కానీ, చెట్ల వద్దకు వెళ్లడం కానీ చేయవద్దని గడ్డం మల్లేష్ నగవాసులను హెచ్చరించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ మొత్తం క్రమంలో ఎవరికైనా, ఏదైనా ఇబ్బందులు ఎదుకైతే .. వారు తగిన సహాయం కోసం 100కి డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని.. పోలీసులు మీకు సహాయం చేస్తారు అని చెప్పి జనంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఏదేమైనా నగర వాసుల రక్షణ కోసం ఎస్ఐ గడ్డం మల్లేష్ చేసిన ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా నెటిజెన్స్ నుంచి అభినందనలు అందుకునేలా చేసింది. ఈ వీడియో షేర్ చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కి సైతం వాహనదారులు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.


ఇది కూడా చదవండి : Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK