/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Telangana Weather Updates: తెలంగాణ రాష్ట్రంలో  రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని   వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఆవర్తనం  వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లాలోని  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం-దక్షిణ ఒడిస్సా తీరంలో ఉందన్నారు. సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉందని చెప్పారు. ఈ ఆవర్తన ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో వాయువ్య & పరిసరాల్లాలోని  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

మరో ఆవర్తనము దక్షిణ ఛత్తీస్‌ఘడ్ మీద  సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఉందని తెలిపారు. షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉందన్నారు. 

రానున్న మూడు రోజులు వర్షాలు ఇలా..

ఈరోజు, రేపు   తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుంచి మోస్తారు  వర్షాలు  అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు  వర్షాలు చాలా చోట్ల  కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుంచి రాష్ట్రంలోని మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వరద నీరు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్ల కింద ఉండకూడదని.. విద్యుత్ స్తంభాలను ముట్టుకోకూడదని సూచించారు.  

Also Read: Ongole Attack Video: ఒంగోలులో దారుణం.. యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు  

Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Section: 
English Title: 
Telangana Weather Updates IMD Predicts Heavy Rains in These Districts in Telangana for next 3 days
News Source: 
Home Title: 

Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 
 

Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Caption: 
Telangana Weather Updates (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Wednesday, July 19, 2023 - 13:13
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
99
Is Breaking News: 
No
Word Count: 
291