Biodiversity flyover reopened: బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పునఃప్రారంభం
హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ను రీ ఓపెన్ చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ జనవరి 4న (శనివారం) ఫ్లై ఓవర్ సేవల్ని స్పీడ్ లిమిట్ నిబంధనలతో పునఃప్రారంభించారు. గతేడాది నవంబర్ 23న బయోడైవర్సిటీ ఓవర్‌పై అతివేగంతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఘటన అనంతరం అప్పటి నుంచి ఈ ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ : నగరంలోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ను రీ ఓపెన్ చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ జనవరి 4న (శనివారం) ఫ్లై ఓవర్ సేవల్ని స్పీడ్ లిమిట్ నిబంధనలతో పునఃప్రారంభించారు. గతేడాది నవంబర్ 23న జరిగిన బయోడైవర్సిటీ ఓవర్‌పై కారు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో యువతి తీవ్రంగా గాయపడిన ఘటన అనంతరం అప్పటి నుంచి ఈ ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఫ్లై ఓవర్ కారు ప్రమాదం ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనిపై నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు ప్రమాదం జరిగిన దాదాపు నెలన‍్నర రోజుల అనంతరం నేటి ఉదయం మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌లు పరిశీలించించిన అనంతరం ఫ్లై ఓవర్‌ను రీ ఓపెన్ చేసి రాకపోకలకు నియమాలతో కూడిన అమనుతులిచ్చారు. ఫ్లై ఓవర్‌పై సెల్ఫీలు దిగితే జరిమానా విధిస్తామని మేయర్ హెచ్చరించారు. సెల్ఫీలు దిగకుండా సైడ్ వాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ప్రమాదానికి సంబంధించి మరిన్ని వార్తలు
అనంతరం మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఫ్లై ఓవర్‌పై 40 కంటే వేగం మించకూడదన్న స్పీడ్ లిమిట్ నిబంధనతో ఫ్లై ఓవర్ సేవల్ని పునఃప్రారంభించినట్లు తెలిపారు. వాహనాల వేగం, వాహనదారుల తీరును నెలరోజుల పాటు పరిశీలిస్తామని.. రోజువారీగా నిపుణుల కమిటీకి నివేదిక సమర్పిస్తామన్నారు. ఫ్లై ఓవర్‌పై అత్యాధునిక కెమెరాలు, స్పీడ్ గన్స్, వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేసిన తర్వాతే ఫ్లై ఓవర్‌ను రీ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు.
Read also : గచ్చిబౌలి కారు ప్రమాదంలో చనిపోయిన మహిళ భర్త ఆవేదన
కాగా, గతేడాది నవంబర్ 4వ తేదీన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ సేవల్ని తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. మూడు మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కోసం ఫ్లై ఓవర్‌ను ఏర్పాటు చేశారు. అయితే నవంబర్ 23న అతివేగంతో వెళ్తోన్న కారు అదుపుతప్పి ఫ్లై ఓవర్ మీద నుంచి పడిపోయిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. అదే తరహాలో కొద్ది రోజుల వ్యవధిలోనే పలు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో అప్పటినుంచీ మూసివేసిన ఫ్లై ఓవర్ సేవల్ని శనివారం పునఃప్రారంభించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..